మైత్రేయ మహర్షి బోధనలు - 122


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 122 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 94. సున్నిత సంబంధము 🌻


మైత్రేయ సంఘము అతి ప్రాచీనమైనది. ఈ సంఘమున ఒకే చైతన్యము చాలా దేహముల యందు పనిచేయుచున్నది. దాని యందు పనిచేయునది కృష్ణచైతన్యమే. అందరి జీవాత్మలు కృష్ణ చైతన్యమునకు వాహికలు. వారి వారి శరీరములు జగత్ కళ్యాణమున కున్ముఖమై యుండును. కృష్ణునికి మేమందరము స్నేహితులమే. అందరి యందు అతనికి మిత్రత్వముండుట చేత ఇది మిత్ర సంఘమైనది. మైత్రేయ సంఘమనగా కృష్ణుని మిత్రుల సంఘమే. కృష్ణుడనగా జగన్నాథుడే. అది విశ్వవ్యాపకమైన చైతన్యము. దాని యందు అహర్నిశలు జీవించు వారు మైత్రేయ సంఘ సభ్యులు.

శ్రీకృష్ణుడు వీరందరి యందును మిత్రత్వము వహించినను, సంఘమందలి సభ్యులు కృష్ణుని మిత్రులనుకొనరు. వారి కతడు గురువు, దైవము. గురువు, దైవము వాత్సల్యకారణముగ మిత్రత్వము చూపుదురు. అంత మాత్రమున కృష్ణ చైతన్యము నందు జీవించుచున్న సభ్యులు కృష్ణునితో మిత్రులవలె ప్రవర్తించక, భక్తులవలెను, శిష్యుల వలెను ప్రవర్తింతురు. మిత్రత్వము చూపుచున్న సద్గురువును మిత్రుడను కొనుట అవివేకము. మిత్రత్వము సలుపుట అతని వాత్సల్యమే కాని తన అర్హత కాదని శిష్యుడెరుగవలెను. అట్లు కానిచో శిష్యుడహంకారమున పడును. ఈ సున్నితమైన గురు శిష్య సంబంధము గమనార్హము.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


22 May 2022

No comments:

Post a Comment