🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
ఎనిమిదో అధ్యాయము
🌻. గర్భో త్పత్త్యాది కథనము - 6 🌻
తతొ జాతే ష్ట మే మాసి - న జీవ త్యో జసోజ్ఘి తః
కించి త్కాల మవస్థానం - సంస్కారా త్పీడి తాంగ వత్ 36
సమయః ప్రసవ స్య స్మా - న్మాసే షు నవ మాది షు
మాటూర స్రవహాం నాడీ - మాశ్రిత్యా న్వవ తారితా 37
నాభిస్థనాడీ గర్భస్య - మాత్రాహార రసావహా
తేన జీవతి గర్భోపి - మాత్రాహారేణ పోషితః 38
ఆస్థి యంత్ర వినిష్పిష్ట - పతితః కుక్షి వర్త్మనా,
మేదో సృగ్ది గ్ద సర్వాంగో - జరాయు పుట సంవృతః 39
నిష్క్రామన్భ్రు శ దుఃఖార్తో - రుదన్నుచ్చైర ధో ముఖః
యంత్రాదేవం వినిర్ముక్తం - పతత్యుత్తాన శాయ్యుతః 40
తొమ్మిదవ మాసమున ప్రసవమునకు సమయమైనప్పటికి కొంతకాలము బరువు మోయువాడిలా నిలిచియున్నట్లు గర్భమునందే ఉండగలదు. (సామాన్యముగా మూడు తొమ్మిదులు మోయువారి విషయమేమనగా, ఎక్కువ భారమైన కట్టెలు మున్నగు భారమును మోయువాడు అట్లే నిలిచిపోయినట్లు నిలిచిపోవును ఇట్లే కొంతకాలము
ఎక్కువగా గర్భములో జీవుడుండు నని వివరణము)
తల్లి యొక్క ఆహార రసమును వహించు నాది యేదైతే ఉందో అట్టి తల్లి ఆహారముతోనే గార్భమందున్న శిశువు పోషింపబడును. (ఇక్కడ శిశువు జన్మించే విధానము వివరించుచున్నాడు).
ఎముకల యంత్ర మయమగు యోని నుండి పీడింపబడినవాడై అదే ద్వారము నుండి జరాయుకోశముతో జుట్టబడి మెదడు రక్తముల చేత మూయబడి సమస్తావయవ పరిపూర్ణుడై క్రిందబడును.
ఇట్లా శిశువు జన్మించిన తరువాత బాల్యావస్థలను వివరించుచున్నాడు. అధోముఖుడై శోకించుచు మిగుల దుఃఖముతో బీడితుండై ఈ విధముగా యోని యంత్రము నుండి బయలుదేరి క్రిందబడును. మరియు వెల్లకిలా బడియుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 60 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 08 :
🌻 Pindotpatti Kathanam - 6 🌻
In the ninth month before the birth takes place, the child remains in a shape which resembles as if someone is carrying a load of his shoulders.
Inside the womb the child gets nourished through the umbilical cord with the substances which come from the mother.
During the birth process the child slips out of the same door of bones and flesh called vagina and the child takes birth passing through the Jarayu (skin bag), blood and fluids.
Finally it falls on the ground. Now i would narrate the sequences of the stages through which the infant passes after the birth.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita
12.Sep.2020
No comments:
Post a Comment