మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 74



🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 74 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అవకూడని పనులను తలపెట్టడం అవివేకం. 🌻


1. కోరికలు తీరుట అనగా అవి లేకుండా పోవడమే! కోరిక కన్నా పైన ఉండాలి. వాటిని కోసివేయుట కాదు. కోరని వానికి అన్ని కోరికలు తీరును. కోరే స్వభావం పోవాలి.

2. కుటుంబ పరమైన బాధ్యతలను, విధులను మాత్రమే నిర్వర్తించవలెను. సంతతి విషయంలో మేడలు కట్టరాదు.

3. యోగాభ్యాసం మొట్ట మొదటి నుండియూ మధురంగానే ఉంటుంది. కొన్ని మెట్లు క్లిష్టంగా ఉన్నట్లు అనిపిస్తాయి. కాని అభ్యాసపాటవం చేత సులభమవుతుంది. ఎంతటి పాపాత్ముడైనా యోగాభ్యాసాన్ని ఆచరిస్తే తరించగలడు.

4. నీ చుట్టు ప్రక్కల వారి యందు ఎన్నడూ హద్దులు మీరకుండా యుండవలెను.

5. వైకుంఠమంటే ఒక స్థితియే గాని, అది‌ ఒక చోటు కాదు. దానిని ఎక్కడ కల్పించుకుంటే అక్కడే ఉంటుంది. ఇంకొక వాని కొరకు జీవించుట వైకుంఠము.


...✍️ మాస్టర్ ఇ.కె.

🌹 🌹 🌹 🌹 🌹



27 Aug 2021

No comments:

Post a Comment