మైత్రేయ మహర్షి బోధనలు - 99


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 99 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 80. నూతన యుగము 🌻


నూతన యుగమును గూర్చి ఎన్నియో ఆశాభావములు వ్యక్తమైనవి. నూతన జీవనము గూర్చి ఎన్నియో ప్రయత్నములు జరుగు చున్నవి. నూతనమగు ఏర్పాట్లను, సర్దుబాట్లను మానవుడు అవిరామముగ చేయుచున్నాడు. అయినను నూతన జీవన మబ్బలేదు. నూతన యుగము రాలేదు. శాంతి కొరకు భౌతిక లోకమున మహత్తరమగు ప్రయత్నములు జరుగుచున్నవి. శాంతి కొరకు యుద్ధములు కూడ చేయుచున్నారు. యుద్ధము, శాంతి ఒకదానికొకటి విరుద్ధము.

మానవునిలోని అశాంతి, అసహనము, అధికార కాంక్ష, శాంతి కొరకు చేయు ప్రయత్నములను విఫలము చేయును. ప్రపంచ శాంతికి ప్రయత్నము చేయువారి స్వభావము నందు శాంతి యున్నచో వారు చేయు కృషి శాంతి నందించ గలదు. ఎవరు దేనియందు నిష్ణాతులో, వారు దానిని ప్రకటించుటకు సమర్థులు. కపటత్వమున శాంతి లభింపదు. కపటత్వమే ప్రకటితమగు చుండును. తనవద్ద లేని వస్తువును తానిచ్చెదననుట కపటము. భావము, భాషలను సత్యము ఆవరించినచో నూతన యుగము ఆరంభము కాగలదు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


06 Apr 2022

No comments:

Post a Comment