భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 147


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 147 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 26 🌻


591. మానవుడిప్పుడు "అహంబ్రహ్మాస్మి" స్థితితో పాటు అనంత జ్ఞాన శక్త్యానందముల అనుభవమును పొందుచుండును. బ్రహ్మానందమయుడై యుండును.

భగవంతుని అద్వైత స్థితి :

592. భగవంతుని ఏకత్వ స్థితి నిర్వివాదాంశమైనది. లోక ప్రసిధ్ధ మతములన్నింటికి ఇది పునాది. ఆధ్యాత్మిక శిక్షణకు ఇది గమ్యస్థానము సిద్ధాంతములో భగవంతుని ఈయేకత్వస్థితిని అంగీకరించుటకు ప్రజాసామాన్యమునకు విశేషాధికామున్నది.

కాని దానిని గురించి పరిశోధించు వారు మాత్రము బహు కొలదిమంది యుందురు.అది సులువైనది, కష్టమైనది, సార్వజనీనముగా తౌహీద్ ను గురించి, ధర్మోపదేపీఠము నుండి, ఉపన్యాస వేదిక నుఃడి మాట్లాడుట చాలా సులువుగా ఉండును. కానీ దీనిని సాధించుట బహుకష్టము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


13 Jan 2021

No comments:

Post a Comment