✍️. సద్గురు వాసుదేవ్
📚 . ప్రసాద్ భరద్వాజ
మనం భూమితోను, ప్రకృతితోను సంబంధం కోల్పోయామా? విశ్వానికి సహజంగా ఉన్న ఆవృత్తులతోనూ, మానవ వ్యవస్థతోను మానవ జాతి ఎలా సమన్వయం సాధించగలదన్న ప్రశ్నకు సద్గురు జవాబు చెప్తున్నారు.
ఒక జీవితకాలంలో మీరు దీనిగురించి తెలుసుకోవాలనుకుంటే అది చాలా కష్టమైన పని. కాని ప్రజలు తమ శరీరంలో ఎంతలోతుగా చిక్కుకుపోయి ఉన్నారంటే వాళలు శరీరాన్ని సాధనంగా చూడలేనంతగా.
శరీరంతో వారి అనుబంధం, గుర్తింపు ఎంత లోతుగా ఉన్నాయంటే వాళలు దీన్ని ‘నేను’ గానే చూడడం కొనసాగి స్తున్నారు. ఈ శరీరాన్ని మీరు ‘నేను’గా చూసిన క్షణంలోనే దానికి బోలెడంత భావోద్వేగం జోడింప బడుతుంది. ఇక మనం దాన్ని సాధనంగా ఉపయోగించలేం.
యోగాలో భూత శుద్ధి ప్రక్రియ అంతా ఇదే - పంచభూతాలనుండి విముక్తం కావడమే. మీరు ప్రభావవం తంగా మీకూ, పంచభూతాలకూ మధ్య దూరాన్ని సృష్టించగలిగితే, అప్పుడు మీకూ, మీ శరీరానికీ మధ్య స్పష్టమైన దూరం ఉంటుంది.
ఒకసారి మీకూ, మీ శరీరానికీ మధ్య మీరు దూరాన్ని సృష్టించుకుంటే మీకు ఎటువంటి యంత్రం లభించిందో తెలుసుకున్న ఆనందం కలుగుతుంది. దానిలో బానిసత్వానికీ, స్వేచ్ఛకూ కావలసిన లక్షణాలన్నీ ఉన్నాయి. దీన్ని మీరు దైవంగా మలచుకోగలరు - మీ శరీరం దివ్యమయ్యే విధంగా మీ శక్తి వ్యవస్థను మలచుకోగలరు.
లేదా ఒక శవం లాగా ఉండిపోగలరు. అంటే, మీరు మీ శరీరాన్నీ ఒక శవంగానైనా మార్చుకోగలరు లేదా శివంగానైనా మార్చుకోగలరు. శవం అంటే మృతకళేబరం, శివం అంటే పరమొన్నతమైనది. దాన్ని ఏం చేయగలరో మీమీదే ఆధారపడి ఉంటుంది. ఒక మనిషి ఈ విధంగా పనిచేయగలడని మీరు ఊహించలేని విధంగా మీ శరీరం పనిచేస్తుంది.
ఈ రోజుల్లో, ముఖ్యంగా నగరాల్లో ఉన్నవారికి, దాదాపు 95% మందికి ఆరోజు చంద్రుడి దశ ఏమిటో తెలియదు. మీరు వాళ్లను తిధి ఏమిటని అడిగితే, వాళలు గూగుల్‌లో చూస్తారు తప్ప ఆకాశం వైపు కాదు. మీ శరీరం మీద, మానసిక నిర్మాణం మీద చంద్రుడి దశల ప్రభావం విస్తృతమయినది.
చంద్రుడి దశలకు మొత్తం మహా సముద్రానే్న పైకి లాగగల శక్తి ఉంది. కానీ మీ మీద మాత్రం ఏమి ప్రభావం లేదని మీరెందు కనుకుంటు న్నారు? ఎందుకంటే మీరు జ్ఞానాన్ని పోగుచేసుకునే సమాజంలా తయ్యారయ్యారు, అంతే తప్ప అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని సంపాదించడం లేదు. ప్రతిదానికోసం మనం ఏదో పుస్తకం చదవాలి. మెల్లమెల్లగా మనం నిజమైన జీవితాన్ని గడపడం వదిలి, కూపస్థ మండుకాలుగా మారుతున్నాం.
దీనివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరెన్నో జరుగుతాయి కూడా. ప్రస్తుతానికి ఈ వైఖరిని మార్చగల స్థితి లోనే మనం ఉన్నాం. పరిస్థితి మరింత అధోగతిపాలైతే, సరిదిద్దడం అంత తేలిక కాదు.
🌷. సౌరమండల వ్యవస్థ - కుమ్మరి చక్రం 🌷
యోగాలో సౌరమండల వ్యవస్థను కుమ్మరి చక్రంగా భావిస్తాం. ఆ చక్రం తిరుగడం నుండే మనం ఉద్భవించాం. సౌర వ్యవస్థకూ, శరీరానికి ఉన్న సంబంధాన్ని మనం గుర్తించాం. అందుకే దానితో సమన్వయించడానికి అనేక అభ్యాసాలను నిర్మించడం జరిగింది. మన శరీరంలో 72,000 శక్తి వాహికలున్నాయి. అవి విశిష్టరీతిలో 114 చోట్ల కలుస్తాయి. రెండు భౌతిక శరీరానికి వెలుపల ఉంటాయి. నాలుగింటిలో మీరు మార్పు చేయగలిగిందేమీ లేదు. అంటే మీరు వాస్తవంగా పరివర్తింప గలిగినవి 108 అన్నమాట.
108 అనే సంఖ్యకు భారతీయ సంస్కృతిలో చాలా ప్రాధాన్యత ఉంది. సూర్యుని గురించిన శాస్త్రం ‘సూర్యసిద్ధాంతం’ అని ఒక ప్రాచీన గ్రంథం ఉంది. భూమికీ, సూర్యుడికీ మధ్య దూరం సూర్యుడి వ్యాసానికి 108 రెట్లు అని ఈ గ్రంథం చెప్తుంది. భూమికీ, చంద్రుడికీ మధ్య దూరం చంద్రుడి వ్యాసానికి 108 రెట్లు. మానవ వ్యవస్థ కూడా దీనితో సమన్వయంతో ఉంటుంది.
🌷. సృష్టి పరాకాష్ఠ 🌷
15,000 సంవత్సరాల కిందట ఆదియోగి తన శిష్యులైన సప్తర్షులకు యోగాన్ని అందిస్తూ, సృష్టిలో మనిషి ఎట్లా పరివర్తన చెందుతారో ఆయన వివరిస్తున్నారు.
మొదటి రూపం మత్స్యం (జల చరం), తరువాత కూర్మం - ఉభయచరం. క్షీరదాలలో మొదటిది వరాహం. తరువాత ఆయన సగం జంతువు, సగం మనిషి గురించి చెప్పారు. తర్వాత వామనుడు - మరుగుజ్జు. ఆ తర్వాత పూర్తి మానవుడు, కాని భావోద్వేగ విషయంలో చంచలుడు. తర్వాత ఆయన ఒక శాంతి పూర్ణ పురుషుడి గురించి, ప్రేమ జీవి గురించి, ధ్యానజీవి గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఒక మార్మికుడైన వ్యక్తి - ఇతర విషయాలను అనుభవంలోకి తెచ్చుకోగలిగిన వ్యక్తి – ఇలాంటి వ్యక్తి రావాల్సి ఉంది. అంటే, ఈ సందర్భంలో ఆయన ఈ భూగోళం మీద మానవ వికాసం గురించి మాట్లాడుతున్నారు.
అప్పుడు సప్తర్షులు ఆదియోగిని ఇలా అడిగారు, ‘‘మనిషి అంతకుమించి ఇంకా వికసించలేడా?’’ అని. దానికి ఆదియోగి ఇలా చెప్పారు, ‘‘సౌరవ్యవస్థలో విపరీతమైన మార్పులు సంభవిస్తే తప్ప మీ శరీరం ఇంతకుమించి వికసించలేదు; భౌతిక సూత్రాలు దానికి అనుమతించవు’’.
🌹 🌹 🌹 🌹 🌹
13 Jan 2021
No comments:
Post a Comment