DAILY WISDOM - 112 : 21. The Study of Man is the Study of Consciousness / నిత్య ప్రజ్ఞా సందేశములు - 112 : 21. మనిషి యొక్క అధ్యయనం చైతన్యం యొక్క అధ్యయనం



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 112 / DAILY WISDOM - 112 🌹

🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 21. మనిషి యొక్క అధ్యయనం చైతన్యం యొక్క అధ్యయనం 🌻


జీవిత ప్రక్రియలు, స్థూలంగా చెప్పాలంటే, రాజకీయాలు, ప్రపంచ చరిత్ర, సామాజిక శాస్త్రం, నీతిశాస్త్రం, ఆర్థికశాస్త్రం, సౌందర్యశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రం రంగాలలో అధ్యయనం చేయబడినవి. మనిషితో అనుసంధానించబడిన ప్రతి జీవితపు కోణం ఈ రూపురేఖలలోనే గ్రహించబడవచ్చు. అయితే ఇదంతా చైతన్యానికి సంబంధించినదై ఉండాలి; లేకపోతే, అవి అధ్యయన అంశాలుగా లేదా అనుభవ వస్తువులుగా కూడా ఉండవు.

కాబట్టి మనిషి సమస్య అంతా చైతన్యం యొక్క సమస్య. మనిషి యొక్క అధ్యయనం చైతన్యం. చైతన్యాన్ని విభజించడం సాధ్యం కాదు కాబట్టి చైతన్య భాగాలు అనేవి ఉండవు. కాబట్టి చైతన్యం అవిభాజ్య కాబట్టి, జీవితం అంతా ఈ అనంత చైతన్యం తనలో తాను ఆడిన ఆట అనే చెప్పవచ్చు. ఉనికి మరియు చైతన్యాన్ని గుర్తించడం కంటే గొప్ప ఆనందం మరొకటి ఉండదు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 112 🌹

🍀 📖 The Ascent of the Spirit 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 21. The Study of Man is the Study of Consciousness 🌻


The processes of life are, broadly speaking, those which are studied in the fields of politics, world history, sociology, ethics, economics, aesthetics, psychology, biology, chemistry, physics and astronomy. Everything connected with man can be said to be comprehended within this outline of the framework of life’s activity. But all this has to be related to consciousness; else, they would not exist even as subjects of study or objects of experience.

The problem of man is therefore the problem of consciousness. The study of man is the study of consciousness. Since it is impossible to conceive a real division of consciousness within itself, it is also not possible to imagine that there can be real objects of consciousness. If there are no such real objects, the whole of life would be a drama played by consciousness within itself in the realm of its infinite compass. There cannot be a greater joy than the identification of existence and consciousness.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment