✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 18. సూర్య చంద్రులు 🌻
సూర్యుని కిరణములు సరాసరి భూమిపై పడుచుండును. అవే సూర్యుని కిరణములు చంద్రునిపై ప్రతిబింబించి భూమికి చంద్ర కిరణములుగ చేరును. కిరణముల రూపమున జీవులే రెండు విధములుగా భూమిని చేరుచున్నారు. కొందరు సూటిగా సూర్యుని నుండి భూమికి చేరగా, కొందరు చంద్రుని మార్గమున భూమికి చేరుచున్నారు.
ఇందు మొదటి వారిని సూర్యవంశపు రాజులని, రెండవ వారిని చంద్రవంశపు రాజులని ప్రాచీన గ్రంథములు పేర్కొనుచున్నవి. సూర్యుడు ఆత్మకు ప్రతీక, చంద్రుడు మనస్సునకు ప్రతీక.
ఆత్మజ్ఞానము కలవారు సూర్యవంశము వారు. మనో విజ్ఞానము కలవారు చంద్రవంశము వారు. మొదటి వారిది దేవయాన పథము అందురు. ఈ పథమున చావు పుట్టుకలు లేవు. రెండవది పితృయాన పథము అందురు. ఈ పథమున జీవులు పుట్టుచు చచ్చుచునుందురు.
మొదటిది అర్చిర్ మార్గమనియు, రెండవది ధూమ్ర మార్గమని కూడ పెద్దలు బోధించినారు. ఈ సూత్రమును వివరించునదే శర్మిష్ఠ - దేవయాని కథగ తెలుపబడినది. దేవయాన పథము ఆత్మజ్ఞాన పథము. శర్మిష్ఠ పితృయాన పథమునకు సంకేతము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
09 Feb 2021
No comments:
Post a Comment