జ్ఞానవాహిక .. నిశ్శబ్ద ధ్యానం


🌹. జ్ఞానవాహిక .. నిశ్శబ్ద ధ్యానం 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ


భయాన్ని ప్రేమగా మార్చేందుకు ధ్యానం :

సుఖాసనంగా సౌకర్యంగా కూర్చుని మీ ఒడిలో మీ కుడి చేతిని ఎడమ చేతి కింద పెట్టండి. ఈ కూర్చునే విధానం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీ కుడి చెయ్యి ఎడమ మెదడుతోను, ఎడమ చెయ్యి కుడి మెదడుతోను అనుసంధానమై ఉంటాయి. భయం ఎప్పుడూ ఎడమ మెదడు నుంచి ధైర్యం ఎప్పుడూ కుడి మెదడు నుంచి పుడతాయి.

ఎడమ మెదడు కారణానికి జన్మస్థానం, కారణం ఎపుడూ పిరికిదే. అందుకే ధైర్యము, తెలివితేటలు ఉన్న వ్యక్తి మీకు ఎక్కడా కనిపించడు. ఎందుకంటే ధైర్యమున్న వ్యక్తికి తెలివితేటలుండవు. అదంతే. కుడి మెదడు సహజ జ్ఞానంతో ఉంటుంది.

అందుకే అది కేవలం ప్రతీకాత్మకంగా ఉంటుంది. అనుబంధం, ఒక నిర్దిష్టమైన అనుబంధంలోకి ప్రవేశ పెడుతుంది. అందుకే కుడి చేతిని ఎడమ చేతి కింద ఉంచి రెండు చెతుల బొటనవేళ్లు కలుసుకొనేలా చేసి హాయిగా కళ్ల మూసుకొని విశ్రాంతిగా కూర్చుని ఎడమ దవడను కాస్త వదులుగా ఉండేలా చేసి నోటితో గాలి పీల్చడం ప్రారంభించండి. ముక్కుతో గాలి పీల్చకండి.

ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి బలవంతాలు ఉండకూడదు. అపుడు పాత పద్ధతిలో ఉంటే మనసు పని చెయ్యడం మానేస్తుంది. ఇది ఒక నూతన శ్వాస పద్ధతి. మీరు దీనిని సులభంగా అలవాటు చేసుకోవచ్చు.

మీరు ముక్కుతో గాలి పీల్చుకోకపోతే అది మీ మెదడుకు ఉల్లాసానివ్వదు. ఎందుకంటే నోటితో గాలి నేరులో రొమ్ములోకి వెళ్లిపోతుంది. ముక్కుతో గాలి పీల్చుకొనేటపుడు ప్రతి నలబై నిముషాలకు ముక్కు రంధ్రాలు ఒకదాని తరువాత మరొకటి బాధ్యతను స్వీకరించి మీ మెదడు రెండు పక్కల ఉల్లాస మర్దనాలు నిరంతరం కొనసాగిస్తూ ఉంటాయి. అందుకే మీ ముక్కులో శ్వాస క్రియ అటు ఇటు మారుతూ ఉంటుంది.

కాబట్టి నేను చెప్పినట్లు హాయిగా సుఖాసనంలో కూర్చుని నోటితో గాలిని పీల్చండి. ముక్కుకు రెండు రంధ్రాలు ఉంటాయి కనుక అది ద్వంద్వంగా పని చేస్తుంది. అందుకే ముక్కుతో గాలి పీల్చుకునేటపుడు మీకు తెలియకుండానే మీ స్థితి అటు ఇటు మారుతూ ఉంటుంది.

కానీ, నోటితో ఎంతసేపు గాలి పీల్చినా మీ స్థితిలోకాని, దాని పని తీరులో కాని ఎలాంటి మార్పు ఉండదు. అందువల్ల అంతా నేరుగా, సవ్యంగా, ఎలాంటి ద్వంద్వం లేకుండా, చాల నిశ్శబ్దంగా సాగిపోతుంది. దాని వల్ల మీ శక్తులు నూతన మార్గంలో ప్రవహించడం ప్రారంభిస్తాయి. కనుక మీరు ప్రతిరోజు కేవలం నలభై నిముషాల పాటు ఏమీ చెయ్యకుండా చాలా నిశ్శబ్దంగా కూర్చోండి.

ఒకవేళ వీలుపడితే ఆ సమయాన్ని అరవై నిముషాలకు పెంచే ప్రయత్నం చేయండి. అలా చేస్తే మీకు మరింత మెరుగ్గా ఉంటుంది. ప్రతి రోజూ అలా చెయ్యండి. సృజనాత్మకంగా చేసేందుకు మీ దారిలో లభించిన ప్రతి అవకాశాన్ని చక్కగా అందుకుని ఆనందించండి. ఎపుడూ ఎదో ఒక పని చేసే జీవితాన్ని ఎంచుకోండి తప్ప ఎప్పుడూ పారిపోకండి. వెనుకంజ వేయకండి. నిర్భయాన్వేషణలో...

జీవితంలో ఎవరైనా భయపడతారు, భయపడాలి. జీవితం అలాగే ఉంటుంది. కేవలం ధైర్యమున్నంత మాత్రాన మీరు నిర్భయులైనట్లు కాదు. ఎందుకంటే, తన భయాన్ని అణచుకోవడం ద్వారా మనిషి నిర్భయుడుగా కనిపిస్తాడే కానీ, నిజానికి, అతడు నిర్భయుడు కాడు. తన భయాలను అంగీకరించిన వాడే నిర్భయుడవుతాడు.

అది ధైర్యానికి సంబంధించిన విషయం కాదు. అది కేవలం జీవిత వాస్తవాలను గమనిస్తూ, ‘‘భయాలన్నీ సహజమే’’ అని తెలుసుకోవడం. అప్పుడే ఎవరైనా తన భయాలను అంగీకరిస్తారు.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


09 Feb 2021

No comments:

Post a Comment