🌹. మనోశక్తి - Mind Power - 80 🌹
Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. Q 77:-- సౌర వర్ణ వ్యవస్థ - 1 🌻
(system of solar spectrum)
Ans :--
1) సౌరవ్యవస్థ అనగా సూర్యుడు, సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు అని అర్థం.
ఈ విశ్వంలో ఎన్నో కోటానుకోట్ల సౌరవ్యవస్థలు ఉన్నాయి. అందులో మానవుడు ఒక సౌరవ్యవస్థ ను మాత్రమే కనుగొన్నాడు.
2) ఒక సౌరవ్యవస్థకు సంబంధించిన కొన్ని లక్షల వర్ణవ్యవస్థలను మన అతీంద్రియాల ద్వారా మనం చూడవచ్చు.
3) ఒక సౌరవ్యవస్థ లో విద్యుదయస్కాంత తరంగాలు ఒక range లో ఉంటాయి. మనము ఇతర జంతుజాతి ఒక సౌరవ్యవస్థలో ఒక range లో ఉన్న విద్యుదయస్కాంత తరంగాల వలయంలో ఉన్నాము.
4) వేరే range లో,వేరే విద్యుదయస్కాంత తరంగాల వలయంలో ఉన్న జీవజాతులు,వాటి దేహాలు మనకు కనిపించవు. మానవుడు కనిపెట్టిన ఏ శాస్త్రపరికరాలు వాటిని పసిగట్టలేవు.
5) భూమి యొక్క చైతన్యశక్తి range ని బట్టి భూమిపై జీవించే జీవరాసులు, వాటి అణువుల నిర్మాణం, కాంతి విలువలు ఉంటాయి.
6) ఒక్కొక్క సౌరవర్ణవ్యవస్థలో ఒక్కొక్క range కి తగ్గ విద్యుదయస్కాంత తరంగాల వలయాలు ఉంటాయి.
7) ఒక్క భూమి మీదే కొన్ని కోట్ల సౌరవర్ణవ్యవస్థలు వున్నప్పుడు ఒక galaxy లో ఎన్ని ఉంటాయో ఆలోచించండి. ఇది మన మానవుని ఇంటెలిజెన్స్ కి అందేది కాదు.
8) ఒక సౌరవర్ణవ్యవస్థ లో ఈ వ్యవస్థ కు తగ్గట్టు చైతన్యశక్తి,కోడ్ లాంగ్వేజ్ ఉంటాయి. ఎలా అయితే ఇండియాలో ప్రతి స్టేట్ కి language ఉన్నట్లు, అలాగే ప్రతి లోకానికి దానికి సంబంధించి లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లోకానికి సంబంధించిన information అంతా code language రూపంలో ఆకాశిక్ record లో పొందుపరచబడి ఉంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment