1) 🌹 కపిల గీత - 348 / Kapila Gita - 348 🌹
🌴 8. ధూమ - అర్చిరాది మార్గముల ద్వారా వెళ్ళు వారి గతి - భక్తియోగ విశిష్టత - 31 / 8. Entanglement in Fruitive Activities - 31 🌴
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 941 / Vishnu Sahasranama Contemplation - 941 🌹
🌻 941. అనాదిః, अनादिः, Anādiḥ 🌻
3) 🌹 సిద్దేశ్వరయానం - 81🌹
🏵 బృందావన భక్తుడు - 2 🏵
4) 🌹. శివ సూత్రములు - 255 / Siva Sutras - 255 🌹
🌻 3 - 40. అభిలాసద్బహిర్గతిః సంవాహ్యస్య - 2 / 3 - 40. abhilāsādbahirgatih samvāhyasya - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 348 / Kapila Gita - 348 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 8. ధూమ - అర్చిరాది మార్గములద్వారా వెళ్ళువారి గతి - భక్తియోగ విశిష్టత - 31 🌴*
*31. ఇత్యేతత్కథితం గుర్వి జ్ఞానం తద్బ్రహ్మదర్శనమ్|*
*యేనానుబుధ్యతే తత్త్వం ప్రకృతేః పురుషస్య చ॥*
*తాత్పర్యము : తల్లీ! బ్రహ్మ సాక్షాత్కార సాధన రూపమైన జ్ఞాన యోగమును నీకు వివరించితిని. దీని ద్వారా ప్రకృతి - పురుషుల యొక్క యథార్థరూపము అవగతమగును.*
*వ్యాఖ్య :*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 348 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 8. Entanglement in Fruitive Activities - 31 🌴*
*31. ity etat kathitaṁ gurvi jñānaṁ tad brahma-darśanam*
*yenānubuddhyate tattvaṁ prakṛteḥ puruṣasya ca*
*MEANING : My dear respectful mother, I have already described the path of understanding the Absolute Truth, by which one can come to understand the real truth of matter and spirit and their relationship.*
*PURPORT :*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 941 / Vishnu Sahasranama Contemplation - 941 🌹*
*🌻 941. అనాదిః, अनादिः, Anādiḥ 🌻*
*ఓం అనాదయే నమః | ॐ अनादये नमः | OM Anādaye namaḥ*
*అనాదిః కారణమస్య న విద్యత ఇతి అనాదిః; సర్వకారణత్వాత్*
*పరమాత్ముడు తానే సర్వకారణుడు కావున ఈతనికి ఆది ఏదియు లేదు. కార్యముకంటే ముందే దాని కారణముండును. పరమాత్ముడు స్వయం సిద్ధ తత్త్వమే కాని కార్య వస్తువు అనగా సృజింపబడినవాడు కాదు. కావున ఈతడే కార్య రూపమగు జగత్తునందలి మొట్టమొదటి తత్త్వమునకు ఆదిభూతుడును కాని ఇతని కంటె ముందేదియు నుండదు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 941🌹*
*🌻 941. Anādiḥ 🌻*
*OM Anādaye namaḥ*
*अनादिः कारणमस्य न विद्यत इति अनादिः; सर्वकारणत्वात् / Anādiḥ kāraṇamasya na vidyata iti anādiḥ; sarvakāraṇatvāt*
*Since He is the cause of everything there is none that precedes Him. There is no ādi or cause for Him as He is the cause of all; so Anādiḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अनादिर्भूर्भुवो लक्ष्मीस्सुवीरो रुचिरांगदः ।जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः ॥ १०१ ॥
అనాదిర్భూర్భువో లక్ష్మీస్సువీరో రుచిరాంగదః ।జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥
Anādirbhūrbhuvo lakṣmīssuvīro rucirāṃgadaḥ,Janano janajanmādirbhīmo bhīmaparākramaḥ ॥ 101 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 సిద్దేశ్వరయానం - 81 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 బృందావన భక్తుడు - 2 🏵*
*మహాసిద్దుడు ఒక రోజు తనను అనుగ్రహించి ఇలా పలికాడు !*
*"ఓయీ! నీ మనస్సు నాకు తెలుసు. నీ ఆకాంక్ష నాకు తెలుసు. రాధాగోవిందుల భక్తునిగా ఈ దీవ్యధామంలో భక్తి యోగమార్గంలో సాధన చేస్తున్నావు. మహనీయులైన రూపగోస్వామి, సనాతనగోస్వామి, కరుణపొందిన వాడవు. అయినా తాంత్రిక సాధన వైపు నీ మనస్సు మొగ్గుతున్నది. అది తప్పేమీ కాదు. నీవు పూర్వజన్మలలో నాకు పరమాప్తుడవు. ఆ రహస్యములు నాకు తెలుసు. నీకు తెలియదు. నీకు చాలా రహస్యమైన కాళీసాధన ఉపదేశిస్తున్నాను. ఈ పద్ధతిలో తపస్సు చెయ్యి. నీకు దేవి సాక్షాత్కరిస్తుంది. ఆమెయే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తెలియజేస్తుంది.”*
*కొన్నాళ్ళ తర్వాత కాళీసిద్ధుడు బృందావనం నుండి కళింగసీమ వైపు తన కాళీవిగ్రహంతో బయలుదేరి వెళ్ళాడు. తాను ఒక వైపు గోస్వాముల సేవచేస్తూనే రాత్రులు కాళీసాధన చేసేవాడు. అప్పటికే తనకు వయస్సు పైనబడింది. కొన్ని సంవత్సరాలు గడిచినవి. యథాశక్తి రాత్రి సాధనసాగుతూనే ఉన్నది. అప్పుడప్పుడు కాళి-రాధాసఖియైన శ్యామకాళీగా బాలికగా ధ్యానవేళ లీలాదర్శనమిస్తున్నది. ఒకనాడు మహాశివరాత్రి ఉపవాసముండి రాత్రంతా ధ్యానం చేస్తున్నాడు. అర్ధరాత్రీ లింగోద్భవ వేళ తన కంటిముందు ఒక జ్యోతి కనిపిస్తున్నది. దానిలో కాళీదేవి ఆకృతి - భీషణసుందరమైన ఆమె ముఖం నుండి మాటలు వెలువడుతున్నవి.*
*"సాధకుడా ! నీ యందు దయ కలిగి వచ్చాను. దివ్యశక్తులు పొందాలని, దీర్ఘకాలం జీవించాలని, బలమైన కోరికతో సాధన ప్రారంభించావు. కాని ఈ సాధన చాలదు. ఈ శరీరంలో నీ ఆయువు ముగిసిపోయింది. అయితే నీ తపస్సు నిష్ఫలం కాదు. వచ్చే జన్మలో నీవు హిమాలయాలలో త్రివిష్టపభూమిలో ఉదయించి ఒక ఏకాంతగుహలోకఠోర సాధనలు చేస్తావు. అప్పుడు నేను వజ్రేశ్వరినై నిన్ను అనుగ్రహిస్తాను. సిద్ధశక్తులతో నీవు మూడువందల సంవత్సరాలు జీవిస్తావు. ఆ తర్వాత ఇంకో జన్మ ఆంధ్రభూమిలో ఉదయించి సన్యాసివై ద్రవిడ దేశంలోని కుర్తాళక్షేత్రంలో పీఠస్థాపన చేస్తావు. ఇప్పటి నీ గురువైన కాళీసిద్దుడు అప్పుడు జన్మమారినా మళ్లీ నిన్ను కలుస్తాడు. అతడు అనంతర కాలంలో నీ పీఠానికి అధిపతియై మా నిర్దేశాన్ని పరిపాలిస్తాడు. నీవు ఎక్కడ ఉన్నా ఏ జన్మలో ఉన్నా నిన్ను రక్షిస్తూనే ఉంటాను. ఎప్పటికప్పుడు నీకు మార్గనిర్దేశం చేయబడుతూ ఉంటుంది”.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 255 / Siva Sutras - 255 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*3వ భాగం - ఆణవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 3-40. అభిలాసద్బహిర్గతిః సంవాహ్యస్య - 2 🌻*
*🌴. కోరికల కారణంగా, అజ్ఞానం మరియు భ్రమలో ఉన్న జీవి (సంవాహ్య) బయటికి వెళ్లి ప్రపంచంలోని ఇంద్రియ వస్తువుల మధ్య తిరుగుతుంది. 🌴*
*యోగి భగవంతునికి లొంగిపోతే, అతను చర్యల యొక్క ఏ తుది ఫలితాల గురించి చింతించడు. కానీ, ఆశించే వ్యక్తి (ఇక్కడ యోగి ఆశపడే స్థితికి జారిపోతాడు) అటువంటి వైఖరిని అభివృద్ధి చేసుకోకపోతే, అతను పదే పదే పరివర్తనలకు కారణమయ్యే కర్మలను కూడబెట్టుకుంటాడు. అతను తన ఇంద్రియ అవసరాలకు లొంగిపోయినప్పుడు, అతని మనస్సు అపరిశుభ్రత యొక్క జాడలను పొందడం ప్రారంభిస్తుంది మరియు కొంత కాలానికి, మలినాలు ప్రధానమవుతాయి, అతని మనస్సు అత్యున్నత వాస్తవికత నుండి స్వయంచాలకంగా వేర్పడి పోతుంది మరియు ప్రాపంచిక మనస్సుగా మారుతుంది. కొన్నిసార్లు, ఇది చాలా తక్కువ వ్యవధిలో జరగవచ్చు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 255 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
*Part 3 - āṇavopāya*
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 3 - 40. abhilāsādbahirgatih samvāhyasya - 2 🌻*
*🌴. Due to desires, the ignorant and deluded being (samvāhya) is outbound and moves among the sense objects of the world. 🌴*
*If the yogi surrenders to the Lord, then he is not concerned with the end results of any actions. But, if the aspirant (here the yogi slides to the status of an aspirant) has not developed such an attitude, then he accumulates karmas that cause repeated transmigrations. When he succumbs to his sensory needs, his mind begins to acquire traces of impurity and over a period of time, impurities becomes predominant, his mind gets disconnected automatically from the highest Reality and transforms into a mundane mind. Sometimes, this could happen in a very short span of time.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
No comments:
Post a Comment