🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 25 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 13 🌻
ఒకరికి విద్యయందు ఆసక్తి వుంది. వరసగా చేస్తూనే పోతుంటాడు జీవితకాలం. ఎం ఎ లు, పిహెచ్ డి లు, ఎం ఫిల్ లు, ఎం ఎ లు, బి ఎ లు వాడికి తోచిన డిగ్రీలన్నీ చేస్తూ పోతుంటాడు. కొంతమంది వున్నారు.
16 ఎం ఎ లు చేశానండీ అని చెప్పుకుంటాడు జీవితంలో. సత్యమే. కాని అది ప్రేయోమార్గము కదా. కొంతమంది ఏం చెప్పుకుంటారు? నేను సైకిల్ తొక్కుతూ ఈ వూరొచ్చానండి. ఇప్పుడు నేను 40 అంతస్థుల మేడ కట్టానండీ అంటాడు.
అంటే ఆయన జీవితంలో ఆయన సాధించింది ఏమిటీ అని ఒకసారి వెనక్కి తిరిగి సింహావలోకనం చేసినట్లయితే... మనం కూడా ప్రతిరోజూ ఏం చేయాలిట ఇప్పుడు. ఈ సింహావలోకనం చెయ్యాలి.
ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలిట. నాకు పుట్టి బుద్ధి ఎరిగినప్పటినుంచీ, ఊహ వచ్చినప్పటి నుంచీ ఇప్పటివరకూ గత 30 ఏళ్ళలో, గత 40 ఏళ్ళలో, గత 50,60,70,80,100 ఏళ్ళల్లో సాధించినది ఏమిటి? అని ఒకసారి ప్రశ్న వేసుకుంటే మన దగ్గర ఏమేమి కనబడుతున్నాయో, అవన్నీ కూడా భౌతికమైనటువంటి అంశములయినట్లయితే, అవన్నీ ఏమిటవీ? ప్రేయోమార్గములు. బంధదాయకములు.
సుఖాన్ని ఇస్తుంది. బంధదాయకం అయినప్పటికీ కూడా సుఖాన్ని ఇస్తుంది. ఇందాక చెప్పా. శ్లేష్మములో పడిన ఈగ సుఖాన్ని పొందుతోంది. ఆహారాన్ని తింటోంది. ఆ ఆనందాన్ని అనుభవిస్తోంది. కాని అందులోనే ప్రాణాన్ని కోల్పోయింది.
శరీరము నేనుగా వున్నప్పుడు జర మరణ దుఃఖములు తప్పవు. ఆ జరామరణదుఃఖము శరీరానికే గాని నాకు కాదు అనేటటువంటి వివేకం పొందాలి అంటే ఆత్మవిచారణ చెయ్యాలి.
ఈ బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యములు నావికావు, శరీరానివి అనేటటువంటి, శరీరంలోనే వుండి శరీరమునకు విలక్షణముగా వుండేటటువంటి స్థితిని సంపాదించాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment