23-JANUARY-2022 ఆదివారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 23, జనవరి 2022 ఆదివారం, భాను వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 148 / Bhagavad-Gita - 148 - 3-29 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 545 / Vishnu Sahasranama Contemplation - 545 🌹
4) 🌹 DAILY WISDOM - 223🌹 
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 128🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 62🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 23, జనవరి 2022*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. ద్వాదశ ఆదిత్య ధ్యాన శ్లోకాలు - 3 🍀*

*3. మిత్రః –*
*మిత్రోఽత్రిః పౌరుషేయోఽథ తక్షకో మేనకా హహః |*
*రథస్వన ఇతి హ్యేతే శుక్రమాసం నయంత్యమీ* 
*నిశానివారణపటుః ఉదయాద్రికృతాశ్రయః |*
*మిత్రోఽస్తు మమ మోదాయ తమస్తోమవినాశనః*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: కృష్ణ పంచమి 09:13:14
వరకు తదుపరి కృష్ణ షష్టి
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 11:10:10
వరకు తదుపరి హస్త
యోగం: అతిగంధ్ 12:49:35 వరకు
తదుపరి సుకర్మ
కరణం: తైతిల 09:11:15 వరకు
సూర్యోదయం: 06:49:23
సూర్యాస్తమయం: 18:06:20
వైదిక సూర్యోదయం: 06:53:10
వైదిక సూర్యాస్తమయం: 18:02:33
చంద్రోదయం: 22:50:14
చంద్రాస్తమయం: 10:28:59
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కన్య
వర్జ్యం: 19:35:45 - 21:12:05
దుర్ముహూర్తం: 16:36:04 - 17:21:12
రాహు కాలం: 16:41:43 - 18:06:20
గుళిక కాలం: 15:17:06 - 16:41:43
యమ గండం: 12:27:52 - 13:52:29
అభిజిత్ ముహూర్తం: 12:05 - 12:49
అమృత కాలం: 03:48:42 - 05:26:46
మరియు 29:13:45 - 30:50:05
మిత్ర యోగం - మిత్ర లాభం 11:10:10
వరకు తదుపరి మానస యోగం - కార్య లాభం 
పండుగలు : సుభాాష్‌చంద్రబోస్‌ జయంతి, 
Subhas Chandra Bose Jayanti

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత -148 / Bhagavad-Gita - 148 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 29 🌴*

*29. ప్రకృతేర్గుణసమ్మూఢా: సజ్జన్తే గుణకర్మసు |*
*తానకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్ ||*

🌷. తాత్పర్యం :
*ప్రకృతి గుణములచే మోహపరవశులైన మూఢులు భౌతికకర్మల యందు సంపూర్ణముగా నియుక్తులైన సంగత్వము నొందుదురు. కర్తయొక్క అజ్ఞాన కారణమున ఆ కర్మలు అధమములైన జ్ఞానవంతుడు వారిని కలతపెట్టరాదు.*

🌷. భాష్యము :
జ్ఞానవిహీనులైన మనుజులు స్థూల భౌతికచైతన్యముతో తాదాత్మ్యము చెందియుండి భౌతికఉపాధుల భావనలో మునిగియుందురు. ఈ దేహము భౌతికప్రకృతి యొక్క వారము వంటిది. అట్టి దేహమునందు తాదాత్మ్యము చెందియుండువాడు మందుడు లేదా ఆత్మనెరుగని అలసుదని పిలువబడును. అజ్ఞానులైనవారు దేహమునే ఆత్మగా భావింతురు. అట్టివారు దేహమునకు సంబంధించినవారిని బంధువులుగా భావించును, జన్మనొసగిన స్థలమును పూజనీయస్థానముగా తలచుచు, ధర్మకార్యముల ఉద్దేశ్యము కేవలము నిర్వహించుట కొరకే యని భావింతురు. 

సాంఘికసేవ, జాతీయభావము, పరహితమును వాంచించుట యనునవి అట్టి భౌతికజగమునందు క్షణకాలమును తీరిక లేకుండా వర్తింతురు. వారికి ఆధ్యాత్మికానుభవము ఒక మిథ్య. కనుక వారు దాని యందు ఆసక్తిని కనబరచరు. అయినను ఆధ్యాత్మికజీవనమున జ్ఞానవికాసము నొందినవారు అట్టి విషయపూర్ణ చిత్తులను కలతపెట్టక తమ ఆధ్యాత్మిక కార్యక్రమములను ప్రశాంతముగా కొనసాగించవలెను. అట్టి మోహగ్రస్థ మానవులను అహింస మరియు లౌకిక ఉపకార కార్యముల వంటి ప్రాథమిక నీతిధర్మములందు నియుక్తులను చేయవచ్చును.

అజ్ఞానులైనవారు కృష్ణభక్తిభావన యందలి కర్మలను అర్థము చేసికొనజాలరు. కావున అట్టివారిని కలతపెట్టరాదనియు మరియు ఆ విధముగా విలువైన కాలమును వృథాపరుపరాదనియు శ్రీకృష్ణభగవానుడు మనకు ఉపదేశించుచున్నాడు. కాని ఆ భగవానుని ఉద్దేశము తెలిసియుండెడి కారణము భక్తులు అతని కన్నను అధిక కరుణను కలిగియుందురు. తత్కారణమున వారు మూఢులను కృష్ణపరకర్మల యందు నియుక్తులను చేయ యత్నించుట వంటి పలురకముల విపత్తులనైనను స్వీకరింతురు. అటువంటి కృష్ణపరకర్మలే మానవునకు అత్యంత అవసరములై యున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 148 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 29 🌴*

*29. prakṛter guṇa-sammūḍhāḥ sajjante guṇa-karmasu*
*tān akṛtsna-vido mandān kṛtsna-vin na vicālayet*

🌷 Translation : 
*Bewildered by the modes of material nature, the ignorant fully engage themselves in material activities and become attached. But the wise should not unsettle them, although these duties are inferior due to the performers’ lack of knowledge.*

🌷 Purport :
Persons who are unknowledgeable falsely identify with gross material consciousness and are full of material designations. This body is a gift of the material nature, and one who is too much attached to the bodily consciousness is called manda, or a lazy person without understanding of spirit soul. Ignorant men think of the body as the self; they accept bodily connections with others as kinsmanship, the land in which the body is obtained is their object of worship, and they consider the formalities of religious rituals to be ends in themselves. 

Social work, nationalism and altruism are some of the activities for such materially designated persons. Under the spell of such designations, they are always busy in the material field; for them spiritual realization is a myth, and so they are not interested. Those who are enlightened in spiritual life, however, should not try to agitate such materially engrossed persons. Better to prosecute one’s own spiritual activities silently. Such bewildered persons may be engaged in such primary moral principles of life as nonviolence and similar materially benevolent work.

Men who are ignorant cannot appreciate activities in Kṛṣṇa consciousness, and therefore Lord Kṛṣṇa advises us not to disturb them and simply waste valuable time. But the devotees of the Lord are more kind than the Lord because they understand the purpose of the Lord. Consequently they undertake all kinds of risks, even to the point of approaching ignorant men to try to engage them in the acts of Kṛṣṇa consciousness, which are absolutely necessary for the human being.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 545 / Vishnu Sahasranama Contemplation - 545 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 545. గుప్తః, गुप्तः, Guptaḥ 🌻*

*ఓం గుప్తాయ నమః | ॐ गुप्ताय नमः | OM Guptāya namaḥ*

*గుప్తః, गुप्तः, Guptaḥ*

*వాఙ్గ్మనసాగోచరత్వాద్ గుప్త ఇత్యుచ్యతే హరిః ।*
*ఏష సర్వేషు భూతేషు గూఢోఽఽత్మేత్యాదికశ్రుతేః ॥*

*దాచబడి యున్నవాడు లేదా రక్షించబడి యున్నవాడు. వాక్కులకును మనస్సులకును కూడ అగోచరుడు లేదా అందరానివాడు.*

:: కఠోపనిషత్ ప్రథమాఽధ్యాయః (3వ వల్లి) ::
ఏష సర్వేషు భూతేషు గూఢోఽఽత్మా న ప్రకాశతే ।
దృశ్యతే త్వగ్ర్యయా భుద్ధ్యా సూక్ష్మాయా సూక్ష్మదర్శిభిః ॥ 12 ॥

*ఈ ఆత్మ సమస్త ప్రాణుల యందును నిగూఢమై యున్నది. సులభముగా అందరికీ కనబడునది కాదు. సూక్ష్మదృష్టి గలవారు తీక్ష్ణమై, సూక్ష్మమైన బుద్ధితో యాత్మను దర్శించ గలుగుతున్నారు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 545🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻545. Guptaḥ🌻*

*OM Guptāya namaḥ*

वाङ्ग्मनसागोचरत्वाद् गुप्त इत्युच्यते हरिः ।
एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मेत्यादिकश्रुतेः ॥ 

*Vāṅgmanasāgocaratvād gupta ityucyate hariḥ,*
*Eṣa sarveṣu bhūteṣu gūḍo’’tmetyādikaśruteḥ.*

*The concealed, as He cannot be attained by speech and the mind.*

:: कठोपनिषत् प्रथमाऽध्यायः (३व वल्लि) ::
एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते ।
दृश्यते त्वग्र्यया भुद्ध्या सूक्ष्माया सूक्ष्मदर्शिभिः ॥ ३.१२ ॥

Kaṭhopaniṣat - Chapter 1
Eṣa sarveṣu bhūteṣu gūḍo’’tmā na prakāśate,
Dr‌śyate tvagryayā bhuddhyā sūkṣmāyā sūkṣmadarśibhiḥ. 3.12.

He is hidden in all beings, and hence He does not appear as the Self (of all). But by the seers of subtle things, He is seen through a pointed and fine intellect.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 223 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 10. You Yourself are the Spirit 🌻*

*The Upanishads are the doctrine of the lifting of your own self to the Self of the universe, the Spirit which you are. It is not merely the Spirit inside you—you yourself are the Spirit. Why do you say “inside”—because when the outer cloth of this body and even the mind is shed at the time of departure, do you remain, or do you exist only in part there? Can you say, “A part of me has gone; I am only partly there”? No, you are wholly there. Independent of the body and also of the mind, you are whole. This is a fact you will recognise by an analysis of deep sleep. The body and mind are excluded from awareness or cognition in the state of deep sleep.*

*Do you exist only partially in deep sleep, or do you exist entirely? If your body and mind are really a part of you, when they are isolated from your consciousness in deep sleep, you would be only fifty percent or twenty-five percent; and when you wake up from sleep, you would get up as a twenty-five percent individual, and not as a whole person. But you wake up as a whole person. Therefore, the wholeness of your true essence need not include the body and the mind. This is what is meant by the word ‘Spirit'.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 126 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మన నిజమైన ఇల్లు అవతలి తీరంలో వుంది. మన మిక్కడున్నది ఎదగడానికి, అనుభవం పొందడానికి, పరిణితి చెందడానికి, కాబట్టి మనం ఆవలి తీరాల్ని ఆమోదించాలి. నీ జీవితం బహుముఖ కోణాల్లో విస్తరించనీ, కానీ ఇది నీ యిల్లు కాదు. కాబట్టి దేన్నీ సొంతం చేసుకోవాలనుకోకు. 🍀*

*మనమంతా ఈ ప్రపంచానికి అపరిచితులం. మన నిజమైన ఇల్లు అవతలి తీరంలో వుంది. మన మిక్కడున్నది ఎదగడానికి, అనుభవం పొందడానికి, పరిణితి చెందడానికి, కాబట్టి మనం ఆవలితీరాల్ని ఆమోదించాలి. మనం పిల్లల్ని ఎలా స్కూలుకు పంపిస్తారో అలా ఇక్కడికి వచ్చాం. ఇది చదువుకునే స్థలం. ఇది మన ఇల్లు కాదు. మనం యిక్కడ ఎంత వీలయితే అంత చదువుకోవాలి. ఎంత వీలయితే అంత తెలుసుకోవాలి. వీలయినంత గాఢమయిన అనుభవాల్ని అందుకోవాలి. నీ జీవితం బహుముఖ కోణాల్లో విస్తరించనీ, కానీ ఒక సంగతి గుర్తు వుంచుకో. ఇది నీ యిల్లు కాదు.*

*కాబట్టి అనుబంధాన్ని ఏర్పరచుకోవద్దు. దేన్నీ సొంతం చేసుకోవాలనుకోకు. దేనికీ అతుక్కుపోవద్దు. అట్లా అయితే అవతలి తీరాన్ని ఎలా చేరుతావు. సాయంత్రమయితే పసివాడు ఇంటివేపు సాగుతాడు. రోజంతా స్కూల్లో వుంటాడు. సాయంత్రం ఇంటి వేపు మళ్ళుతాడు. స్కూలు తప్పనిసరి. స్కూలు లేకుంటే అతని ఎదుగుదల వుండదు. బాధలతో, ఆనందాలతో వివేకంతో, తెలివితక్కువతనంతో వీటన్నిటి గుండా మెల్ల మెల్లగా సమతూకాన్ని అందుకుంటాం. కేంద్రానికి చేరుతాం. ఎన్నెన్నో దశల గుండా సాగుతాం. ఆవలి తీరం నించీ పడవ వచ్చేసరికి మనం అన్ని విధాల సిద్ధపడి వుంటాం. మనం సిద్ధపడి వుంటేనే పడవ వస్తుంది. లేని పక్షంలో మనం మళ్ళీ మళ్ళీ స్కూలుకు వెళ్ళాలి.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 62 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 48. మాయ 🌻*

*సాధనలో లోతులు పొందినవారు కూడ కష్ట సమయముల యందు ఒంటరితనము ఆనుభవింతురు. సద్గురు బోధనలన్నీ అసత్యము లనిపించును. గురువులు గురుపరంపర తాము ఏర్పరచుకొన్నదే కాని నిజమునకు లేవనిపించును. రకరకములైన అభిప్రాయములు గడ్డు సమయములలో క్రమ్ముకొని తెలిసిన విషయమును జ్ఞానమును) కప్పివేయును, తన కెవ్వరూ లేరని, తనవారెవ్వరూ లేరని; బోధనలు, ప్రార్థనలు అక్కరకు రావని- దివ్య సహాయము వట్టిమాట యని- అంతయూ శుష్క వేదాంతమని అనిపించును. పై భావములు కలుగుటకు కారణము మాయ.*

*మాయావరణములో జీవులుండుటచే మాయ బలపడి నప్పుడెల్ల జీవుడు నిస్సహాయుడిగ బాధపడును. మాయ పలుచబడినపుడు తాను శక్తివంతుడుగ భావించును. మాయ చాల విచిత్రముగ మెదడును స్పృశించగలదు. యుగయుగముల నుండి మాయయే సృష్టిని నడిపించు చున్నది. మాయకున్న అనుభవము జీవునికి లేదు. మాయలో నున్నవానికి తనను మాయ కప్పినదని తెలియకపోవుటయే మాయ. ఇది మాయాదేవి నేర్పరితనము. మాయకు నమస్కరించి దారి చూపు మనినచో దారి చూపగలదు. తెలిసి మాయలో బడుటకన్న సృష్టిలో అద్భుతమేమియును లేదు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment