మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 142
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 142 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. శ్రీకష్ణావతారము 🌻
కృష్టావతార తత్త్వమున అనేక కళలున్నవి. శ్రీకృష్ణుడు పాండవులకు ఆదర్శపురుషుడు. ధర్మరాజునకు గురువు, దైవము, ద్రౌపదికి రక్షకుడు. కుంతీ దేవికి దిక్కు. కౌరవులకు రాజకీయ విజ్ఞానవేత్త. రాజలోకము దృష్టిలో ఆదర్శ రాయబారి. అర్జునునకు దేహమునకు, ఆత్మకు సారధి. కాని తనకు తాను మాత్రము క్రీడాపరుడైన శిశువు.
కురుపాండవ యుద్ధమును గాని, యాదవుల వినాశమును గాని వారించుటకు తనకు ప్రయోజనం లేదు. వారింపవలసిన మమకారము లేదు. తాను కావలయును అని అనుకొన్నవారికి కావలసినవాడు. జీవితమున సన్నివేశములను క్రీడగా నడిపి, దేహపరిత్యాగ క్రీడలో జగత్తునకు వెలుగుగా మైత్రేయునందు ప్రవేశించినవాడు.
....✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
30 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment