శ్రీ శివ మహా పురాణము - 470


🌹 . శ్రీ శివ మహా పురాణము - 470 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 34


🌻. అనరణ్యుడు - 2 🌻

ఒకనాడు ఆ మునీశ్వరుడు పుష్పభద్రా నదియందు స్నానము చేయుటకు వెళ్లుచూ, లక్ష్మివలె మనోరమ, ¸°వనవతి యగు పద్మను చూచెను (12).

ఆ మహర్షి సమీపములో నున్న జనులను 'ఈ కన్య ఎవరు?' అని ప్రశ్నించెను. శాపభీతులగు జనులు నమస్కరించి ఇట్లు నివేదించిరి (13).

జనులిట్లు పలికిరి |

అపర లక్ష్మీదేవి యనదగిన ఈ సుందరి అనరణ్యుని కుమార్తె. ఈమె పేరు పద్మ. సద్గుణములకు నిలయమగు ఈమెను వివాహమాడ వలెనని శ్రేష్ఠులగు రాజకుమారులు గోరుచున్నారు (14).

బ్రహ్మ ఇట్లు పలికెను -

సత్యమును పలికే జనుల ఆ మాటలను విని ఆ మహర్షి మనస్సునందు చాల క్షోభను పొంది, ఆమెను పొందగోరినాడు (15). ఓశైలరాజా! కామియగు ఆ మహర్షి స్నానముచేసి ఇష్టదైవమగు శివుని యథావిధిగా పూజించి భిక్షకొరకై అనరణ్యుని సభకు వెళ్లెను (16). రాజు మునిని చూచి భయముతో కంగాపడిన వెంటనే నమస్కరించెను. మరియు మధుపర్కాదులనిచ్చి భక్తితో పూజించెను (17). ఆ మహర్షి సత్కార ద్రవ్యములలో తనకు నచ్చిన వాటిని స్వీకరించి కన్యను తనకిమ్మని కోరెను. రాజు ఏమియూ చెప్పజాలక మౌనముగా నుండి పోయెను (18).

' ఆ కన్యను నాకిమ్ము. లేనిచో, క్షణకాలములో సర్వమును భస్మము చేసెదను' అని ఆ ముని మహారాజును కోరెను (19). ఓ మహర్షీ! రాజపరివారమంతయూ ఆ మునియొక్క తేజస్సుచే దిగ్భ్రాంతులైరి. రాజు ఆముదుసలి బ్రాహ్మణుని చూచి బంధువులతో సహా రోదిల్లెను (20). ఆతని భార్యలందరు ఏమి చేయుటకు తోచక ఏడ్చిరి. కన్యయొక్క తల్లియగుమహారాణి దుఃఖపీడితురాలై మూర్ఛిల్లెను (21). కుమారులందరు శోకారులందరు శోకావిష్టమగు మనస్సు గల వారైరి. ఓ పర్వతరాజా! రాజ సంబంధి జనులందరూ శోకమును పట్టజాలకపోయిరి (22).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


05 Nov 2021

No comments:

Post a Comment