నిర్మల ధ్యానాలు - ఓషో - 80
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 80 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనిషి బయటి నించీ చూస్తే అత్యల్పుడు. చిన్ని ధూళి కణం. కానీ లోపలి నించి చూస్తే, అతని కేంద్రం నించీ చూస్తే అతను సమస్త విశ్వం. మనుషుల్ని బుద్దుల ద్వారా, కృష్ణుల ద్వారా, అర్థం చేసుకోవాలి. ధ్యానం ద్వారా అర్థం చేసుకోవాలి. 🍀
మనిషి అశాశ్వతంగా కనిపిస్తాడు. ఎంతో అత్యల్పంగా, ఒక మంచు బిందువులా అనిపిస్తాడు. కానీ సమస్త సముద్రాలు అతనిలో నిక్షిప్తమయి వున్నాయి. అన్ని ఆకాశాలు అతనిలో లీనమయి వున్నాయి. బయటి నించీ చూస్తే అతను అత్యల్పుడు. చిన్ని ధూళి కణం. ధూళిలో ధూళి. అంతే. కానీ లోపలి నించి చూస్తే, అతని కేంద్రం నించీ చూస్తే అతను సమస్త విశ్వం. సైన్సుని, మతానికి వున్న తేడా అది.
సైన్సు మనిషిని బాహ్యం నించీ చూస్తుంది. ఆధ్యాత్మికంగా చూడదు. దైవత్వాన్ని చూడదు. కేవలం భౌతికంగా, రసాయనికంగా, శారీరకంగా యింకో జంతువుని చూసినట్లు చూస్తుంది. అందుకనే సైంటిస్టులు ఎంత సేపు మనిషిని అర్థం చేసుకోవడానికి యితర జంతువుల్ని పరిశోధిస్తారు. జంతువులు సామాన్యమైనవి. సులభంగా వాటిని లొంగదీసుకోవచ్చు. అందుకని సైంటిస్టులు వాటిపై పరిశోధనలు చేస్తారు. వాటిని బట్టి వచ్చిన నిర్ణయాల్ని మానవజీవికి అంటగడతారు. సైంటిస్టులు మనుషుల్ని ఎలుకల స్థాయికి దిగజార్చారు. మనిషిని కుక్కల ద్వారా, ఎలుకల ద్వారా అంచనా వేస్తున్నారు.
మనుషుల్ని బుద్దుల ద్వారా, కృష్ణుల ద్వారా, అర్థం చేసుకోవాలి. ఇది ప్రాథమిక విషయంగా అవగాహన చేసుకోవాలి. ఉన్నతమైన దానిని అల్పమైన దాని ద్వారా అర్థం చేసుకోకుడదు. ఉన్నతమైన దాని ద్వారా అల్పస్థాయి లోనిది అర్థం చేసుకోవచ్చు కానీ అల్పమైన దాని ద్వారా ఉన్నతమైన దానిని అర్థం చేసుకోవటం కుదరదు. మనిషిని బయటి నించీ అర్థం చేసుకోవడం కుదర్దు. పరిశీలన ద్వారా కాదు. ధ్యానం ద్వారా అర్థం చేసుకోవాలి. వ్యక్తి లోపలికి, ఆత్మాశ్రయ తత్వంలోనికి అడుగు పెట్టాలి. అపుడు అక్కడికి వెళితే మనిషి దేవుడన్న రహాస్యాన్ని కనుక్కుంటాం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
16 Oct 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment