శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 216 / Sri Lalitha Chaitanya Vijnanam - 216


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 216 / Sri Lalitha Chaitanya Vijnanam - 216 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 
మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ |
మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః ‖ 54 ‖

🌻 216. “మహాసత్యా'' 🌻

మహత్తరమైన సత్వము గలది శ్రీమాత అని అర్థము.

సత్త్వ మనగా ఉనికి, వుండుట. సృష్టి స్థితిగొని వుండుటకు మూలకారణము శ్రీమాతయే. ఆమె సంకల్పించినచో మొత్తము సృష్టి తిరోధానము చెందగలదు. పురోగమనము కూడ చెందగలదు. స్థితియందుండ గలదు. సమస్త సృష్టిని తన యందు లయము చేసుకొని తానే కేవలముగ నుండగలదు. అట్టి ఉనికి మహాసత్త్వము.

పరాప్రకృతిగ పరమ పురుషునియందు స్థితిగొని యుండుట, సంకల్ప మాత్రమున సృష్టి నిర్మాణము గావించి బ్రహ్మ నుండి చీమ వఱకు అన్నిటి యందు ఉనికిగ నుండుట కూడ చేయును. ఆమె మన యందు వుండుట వలననే మనము వున్నామని భావించుచున్నాము.

ఆమె లేని మనము లేము - మనము లేని ఆమె యున్నది. మన మున్నామని మనకు

భ్రాంతి ఆమె మాయ నుండే కలుగుచున్నది. నిజమున కున్నది ఆమెయే. అల యందున్నది సముద్రమే కదా! సముద్రము లేక అల లేదు. కాని అలలేని సముద్ర ముండగలదు. అందుకని ఆమెయే మహాసత్త్వం మన ఉనికి రహస్యము మనకు తెలియుటయే నిజమగు జ్ఞానము.

శ్రీమాతయే దీని ననుగ్రహించ గలదు. ఆమెను తెలిసినవాడే తెలిసినవాడు. ఆమె అనుగ్రహ పాత్రులగుటకు సాధకులు త్రిగుణములలో ప్రధానమైన సత్త్వగుణమున నిలువవలెను. శ్రీమాత సత్త్వ గుణమునకు కూడ అతీతమైనప్పటికిని ఆమెను చేరుమార్గము సత్త్వగుణమే.

సత్త్వగుణము నిర్మలమగు నీరు వంటిది. రజస్తమో గుణములు కలతవారిన నీరు వంటివి; బురద నీరు వంటివి. సత్త్వగుణ లక్షణములు భగవద్గీతయందు 16వ అధ్యాయమున మొదటి మూడు

శ్లోకములలో తెలుపబడినవి. వానిని శ్రీమాత ఆరాధనతో జోడించి అభ్యసించినచో సాధకుడు సత్సాధకుడు కాగలడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 216 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Mahā-sattvā महा-सत्त्वा (216) 🌻

Sattvā is one of the three guṇa-s, the other two being rajas and tamas. Out of the three, sattva guṇa is supreme. When this guṇa is dominant in a person, he cannot commit any sins either knowingly or unknowingly. She chooses these persons to shower on them Her special grace.

Here She is referred to as an embodiment of the qualities of sattva guṇa such as understanding the reality, emitting positive energy from one’s own self, the mental and physical strength due to the positive vibrations etc.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


22 Feb 2021

No comments:

Post a Comment