Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి
📚. ప్రసాద్ భరద్వాజ
🌷. అధ్యాయము : మనోశక్తి 🌷
🌻 Q1:- మైండ్ (mind) లేదా మనోశక్తి (mind power)కి మెదడు (brain) కి మధ్య తేడాలేంటి ? ఇవి నిర్వహించే పనులు ఏంటి? 🌻
A. 1) brain (మెదడు) అనేది దేహంలో ఒక అవయవం.
గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, ప్రేగులు, కళ్ళు ఎలాగో మెదడు కూడా ఒక అవయవం. శాస్త్రవేత్తలు మెదడును ముక్కలుగా చేసి పరిశోధన చేశారు. చిన్నమెదడు, పెద్దమెదడు, మెడుల్లాఅబ్లాంగేట, ఎడమ మెదడు, కుడి మెదడు, అని అనేక పేర్లు పెట్టారు.
2) మైండ్ లేదా మనోశక్తి ఆత్మశక్తికి అంతర్ ప్రపంచానికి సంబంధించింది. మైండ్ చర్మచక్షువుకు కనిపించదు. శాస్త్ర పరికరాలకు అంతు చిక్కదు.
3) మెదడు దేహంలోని అన్ని భాగాలను నియంత్రిస్తుంది, మరియు దేహంలోని నాడులన్నింటికి అనుసంధానింపబడి ఉంటుంది.
4) మైండ్ గుండె కొట్టుకోవడం, ఊపిరితిత్తులు పనిచేయడం, జీర్ణవ్యవస్థ లాంటి ఎన్నో ప్రక్రియలను నడిపిస్తుంది. ఈ ప్రక్రియలను నడిపించడానికి మైండ్ మెదడు అనే సాధనాన్ని ఉపయోగించుకుంటుంది.
5) ఆలోచనా తరంగాలు (thought waves) మైండ్ లో ఉత్పత్తి అయి మెదడు ద్వారా బయటకు వస్తాయి. ఒక డాక్టర్ బ్రెయిన్ ని కణవిభజన చేయగలడు కాని , ఆ మెదడులోకి ఆలోచనలు ఎక్కడి నుండి వచ్చాయో అనే విషయం చెప్పలేడు.
6) దేహం ఏర్పడక ముందే ఆత్మ మరియు మైండ్ రెండు ఉన్నాయి. దేహం నశించిన తర్వాత కూడా ఆత్మ మరియు మైండ్ రెండూ ఉంటాయి.
7) మైండ్ యొక్క ఊహాశక్తి నుండి జనించిందే ఈ దేహం, ఈ దేహం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ మైండ్ జన్మపరంపరలుగా, మనతోనే ఉంది.జన్మ పరంపరల నుండి జ్ఞానాన్ని, అనుభవాల్ని, చైతన్యశక్తిని, మైండ్ మోసుకొస్తూ ఉంది.
8) గత కోటానుకోట్ల జన్మల తాలూకూ జ్ఞానాన్ని కూడా మైండ్ లో నిక్షిప్తం అయి ఉంది. మరణించిన తర్వాత దేహాన్ని వదిలేస్తాము. కానీ జ్ఞానం, అనుభవాలు, చైతన్య శక్తి సంస్కారాలు, అన్ని నిక్షిప్తం అయి ఉంటాయి. అవి తర్వాత కూడా continue అవుతాయి.
9) ప్రతి జన్మకు మైండ్ వ్యాకోచం చెందుతూ ఉంటుంది. ఈ భూమి మీద జన్మపరంపర పరిసమాప్తి అయిన తర్వాత ఆత్మ మరో లోకంలో జన్మ తీసుకుంటుంది. అక్కడ కూడా మైండ్ అక్కడి జ్ఞానాన్ని, అనుభవాల్ని, పొందుతూ వ్యాకోచం చెందుతుంది.
10) ఈ విశ్వంలో ప్రతి ఆత్మశకలానికి మైండ్ ఉంది. అణువు, పరమాణువు, ఎలెక్ట్రాన్, ప్రతీది చైతన్యశక్తి మరియు మైండ్ ని కలిగి ఉన్నాయి. అన్నింటి మైండ్స్ అనుసంధానింపబడి ఉన్నాయి.
11)మనిషికి ఆత్మ, మైండ్ ఎలాగైతే ఉంటుందో, అలాగే భూమికి, భూమిపై ఉన్న సకల జీవరాశులకు ఆత్మ, మైండ్ ఉంటాయి. మూలకాలు, ఏకకణ జీవులకు కూడా ఆత్మ, మైండ్ ఉంటాయి.
12) సీతాకోకచిలుక, సాలెపురుగు, ఇవి వాటి మనోశక్తి ద్వారానే అందమైన దేహాన్ని, గూటిని నిర్మించుకుంటున్నాయి. పక్షులు వేల మైళ్ళు వెళ్లి ఆహారాన్ని సంపాదిస్తున్నాయి. జంతువులు జీవజాతులన్ని, ప్రకృతి వైపరిత్యాలని ముందుగానే పసిగడుతున్నాయి. ఇవన్నీ మనోశక్తి ద్వారానే సాధ్యం.
13) సంకల్పం, ఊహాశక్తి, ఇంటలిజెన్స్, తర్కం, విశ్లేషణ, స్వప్నాలు, ఆలోచనాశక్తి, clairvoyance, telepathy, సహజావబోధన, జ్ఞాపకశక్తి, ఈ ప్రక్రియలన్ని మైండ్ ద్వారానే జరుగుతున్నాయి.
14) మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, అనేవి మైండ్ కి సంబంధించినవి. కామం, క్రోధం, రాగం, ద్వేషం, లాంటివన్ని మైండ్ నుండి పడుతున్నాయి.
జీవరాసులన్నీ కలిస్తేనే ప్రకృతి. ప్రకృతి అనే మహాసముద్రం లో మనిషి ఒకానొక అల మాత్రమే.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment