Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి
📚. ప్రసాద్ భరద్వాజ
🌷. అధ్యాయము : మనోశక్తి 🌷
🌻 Q 3:-- భౌతిక పదార్ధం ఎలా సృష్టించ బడుతుంది? 🌻
A:-- మన మైండ్ నుండి వెలువడే ఆలోచనా తరంగాలు ఎంత సాంద్రత తో, ఎంత తీవ్రతతో, ఉన్నాయో దాన్ని బట్టి చైతన్యశక్తి భౌతిక పదార్ధంగా రూపాంతరం చెందుతుంది.
మైండ్ నుండి వెలువడే ఆలోచనా తరంగాలు బలహీనమైతే దానికనుగుణంగా మిధ్యా భౌతిక రూపం (pseudo physical form) ఏర్పడుతుంది. ఆలోచన తరంగాల ఫ్రీక్వెన్సీ, శక్తి, సాంద్రతలకు సరిపడే లోకంలో అక్కడ పరిస్థితులుకు అనుగుణంగా భౌతిక రూపం ఏర్పడుతుంది.
అంతేకాని మన మైండ్ నుండి వెలువడిన ఆలోచనా తరంగాలు నశించిపోవడం గాని,మటుమాయమైపోవడం గాని జరుగదు.
మన ఆలోచనలు భౌతిక వాస్తవం పొందాలంటే మన మైండ్ లో,మన మనో ప్రపంచంలో, ఎంత గాఢంగా వాంచిస్తున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది.
మన ఆలోచనల తీవ్రత,ఫీలింగ్స్,ఎమోషన్స్, ఎంత తీవ్రంగా ఉన్నాయి, మన నమ్మకపు వ్యవస్ధ ఎలా ఉంది, అనేది ముఖ్యమైంది.
మన మనోశక్తి ద్వారా మన దేహాన్ని సృష్టించుకున్నామన్నది ఎంత నిజమో,మన ఆలోచనలు వాస్తవ రూపం పొందుతాయన్నది కూడా అంతే నిజం.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment