🌹. మనోశక్తి - Mind Power - 7 🌹

🌹. మనోశక్తి - Mind Power - 7 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీ వైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. Q 7:-- conscious mind (చేతనాత్మక మనస్సు), subconscious mind (ఉపచేతనాత్మక మనస్సు) అంటే ఏమిటి ? 🌻 

A:-- 1) conscious మైండ్ ఎరుకలో ఉంటుంది, ఉపచేతనాత్మక మనస్సు ఎరుకలో ఉండదు.

2) మన మైండ్ అనంతమైన పోరలను కలిగి ఉందని ఊహించుకుంటే, ఉపరితలంలో పైన ఉండే పొర conscious మైండ్ గా పిలవబడుతుంది. 

అంతరాంతరాలలో అపరిమితమైన పొరలను ఉపచేతనాత్మక మనస్సు అని చెప్పవచ్చు. మైండ్ అంటే పొరలు అని కాదు, అర్థమవ్వడానికి అలా చెప్పడం జరిగింది.

3) మహాసముద్రమంత మైండ్ లో conscious మైండ్ ఒక అల. అలజడి మాత్రమే. conscious మైండ్ బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగి అంతర ప్రపంచానికి ఒక మార్గంగా పనిచేస్తుంది.

4) అంతర్ ప్రపంచం లేదా అంతర్ శక్తి లేదా subconscious మైండ్ ను మహాసముద్రం తో పోల్చవచ్చు.దీనిని సూపర్ conscious మైండ్ అని కూడా అనవచ్చు.వాస్తవానికి మైండ్ కి పేర్లు లేవు.

4) ఆత్మజ్ఞానం పెరిగేకొద్దీ subconscious మైండ్ open అవుతుంది.

5) జన్మపరంగా సంప్రాప్తించుకున్న జ్ఞానం అంతా subconscious మైండ్ లో store అవుతుంది.

6) conscious మైండ్ యొక్క ఉప ఉత్పత్తి గర్వం.ఇది బాహ్యప్రపంచం లో సంపాదించుకున్న జ్ఞానం వల్ల పుడుతుంది.అహం వల్ల మనస్సు విజృంభిస్తుంది.దీనివలన దుఃఖం పుడుతుంది.

7) conscious మైండ్ కి అంతర్వాణి మరియు విచక్షణ జ్ఞానం తోడైతే ఆ వ్యక్తులుకు positive thinking ఉంటుంది.

8) conscious మైండ్ ని తప్పుడు అభిప్రాయాల వల్ల, సంఘం ఇచ్చిన బుద్ధి వల్ల బాహ్యప్రపంచపు పరిమిత జ్ఞానం వల్ల, మానసిక సోమరితనం వల్ల అసాధారణ రీతిలో ఉపయోగించు కోలేక పోతున్నాము.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment