🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 1 🌹

🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 1 🌹
🌻. అక్షం మార్పు 🌻
✍️. భావనగరి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 Q:-అక్షం మారడమంటే ఏంటి?అక్షం మారితే మనిషి ఎదుర్కోవాల్సిన పరిణామాలేంటి?ఆత్మ లోక ఆత్మ ఎలాంటి వారిని రక్షిస్తాయి? 🌻

A: ఉన్నత చైతన్యం లేదా దేవుడు మనిషికి సంకల్ప స్వేచ్ఛను ఇచ్చాడు కానీ మనిషి పెడదారిలో నడుస్తూ,చెడు పనులు చేస్తూ ఉండడం వల్ల చెడు స్పందనలు ఏర్పడతున్నాయి. ఆ చెడు స్పందనలను ప్రకృతి గ్రహిస్తుంది.

మనిషి ఉపచేతనాత్మక మనస్సుని వినకుండా,పూర్తిగా ఆధ్యాత్మిక మార్గానికి దూరంగా వెళుతున్నాడు. అద్భుతమైన ప్రకృతి సమతుల్యాన్ని నాశనం చేస్తున్నాడు. అందువల్ల ప్రకృతిలో ప్రతికూల శక్తి,చేడు స్పందనలు బాగా ఎక్కువవుతున్నాయి. ఇదంతా ఆధ్యాత్మిక లోపం వల్లనే,ప్రకృతికి మెరుగుపరచగల, నాశనం చేయగల సామర్ధ్యం ఉంది.

మనిషి యొక్క చెడు స్పందనలు వల్ల దృవాల స్థలమార్పు జరుగుతుంది, భౌతికంగా భూఅక్షం మారుతుంది, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి, భూకంపాలు, వరదలు, tornodos, అగ్నిపర్వతాలు బద్దలవడం, ఇవన్నీ ప్రకృతి మన ఆలోచనలు మారాలని మనకిచ్చే హెచ్చరికలు.

ఉదాహరణకు మన శరీరాన్ని భూమితో పోల్చవచ్చు,మన శరీరంలో, జలుబు,fever, వ్యాధుల ద్వారా మన శరీరం సమతుల్యస్థితికి చేరుకుంటుంది,అలాగే ప్రకృతి ప్రకృతివైపరిత్యాల ద్వారా సమతుల్యం పొందుతుంది,దైవాదృష్టి అంతా పవిత్రంగా,ఉదారంగా,శాంతియుతంగా ఉండాలి, మనిషి సన్మార్గంలో నడవాలి.
ఎవరైయితే సన్మార్గంలో వుంటారో,ఎవరైతే ఉన్నత ఆవరణకు చేరి వుంటారో వారిని వారి స్పందనలు బట్టి ఆత్మలోక ఆత్మలు రక్షిస్తాయి.

ప్రపంచంలో 25% మాత్రమే బ్రతుకుతారు. కెనడా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా లో కొన్ని ప్రదేశాలలో ప్రతికూల ఆలోచనలు తక్కువ ఉన్నాయి.

జలప్రళయం, భూకంపంతో, ప్రపంచమంతా గొలుసుకట్టు ప్రతిస్పందనలు జరుగుతూ శుద్ధప్రక్రియ జరుగుతుంది.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment