🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 5 🌹

🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 5 🌹
🌻 Chapter - సానుకూలంగా ఆలోచించండి. 🌻
✍️. భావనగరి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻 Q:- మనం ప్రతికూలంగా ఆలోచిస్తున్నామని మనకు ఎలా తెలుస్తుంది? 🌻 

Ans :-
1) భయం:--
నెగటివ్ ఆలోచనలు వల్ల, మన చుట్టూ -ve ఆలోచనలు చేసే వ్యక్తులు ఉన్న, దైవము పట్ల విశ్వాసం లేకపోయినా, ఆధ్యాత్మికత లేకపోవడం వల్ల, అవగాహన లోపం వల్ల భయం ఏర్పడుతుంది. ఇది మన ఉపచేతనాత్మక మనస్సు గుర్తిస్తుంది,

మనం మన ఇంటిని నిరాడంబరంగా, శుభ్రంగా, సూర్యరశ్మి తగిలే విధంగా , మొక్కలతో ఉంచుకోవాలి. ఇవన్నీ మనలో సానుకూల స్పందనలు కలిగిస్తాయి.

2) చింత:-
నిరంతరం చింతిస్తూ ఉన్న కూడా కిందకి అనగా కింది ఆవరణకు పడిపోతాం. 

మనం ఫలాపేక్ష లేకుండా కర్మ చేయాలి. దైవము పట్ల విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోవడం అంటే కారులో పెట్రోల్ పోయకుండా కారు నడవాలనుకోవడం లాంటిది.

3) సంశయం:--
మనం గురువుని కూడా సంశయిస్తాం. మంచి గురువా కాదా అని. గురువు పట్ల విశ్వాసం ఉండాలి. అలా విశ్వాసం లేకుండా ఉన్న కూడా ప్రతికూలంగా ఆలోచించినట్లే.

4) నసపెట్టడం:--
నస పెట్టడం ఆధ్యాత్మికంగా తప్పు. ఇది అహం నుండి పుడుతుంది. మానసికంగా వేధించడం, మాటలతో చిత్రహింస పెట్టడం, ఇదంతా స్వార్థంతో వారి మాట నిలబెట్టుకోవడం కోసం చేస్తారు.

5) ఫిర్యాదు, గొణుగుతూ ఉండడం:--
-ve గా ఆలోచించే వ్యక్తి ఎప్పుడు గొణుగుతూ, ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. 

ఆ విధంగా -ve నే ఎక్కువగా ఆకర్షిస్తుంటాడు,మనం positive గా ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచనలే ఆ వ్యక్తులే మన వైపు ఆకర్షింపబడతారు.

6) అవసరమైన దాని కన్నా ఎక్కువ కష్టపడటం:--
ఒక వ్యక్తి తాను ఆ పని చేయలేకపోయినా దానిని చేస్తున్నాడంటే అతనికి గర్వం,అహం ఉన్నట్లు. 

భూలోకంలోని ఆత్మలన్ని ఒకరికొకరు సహాయం చేసుకోవడానికే సృష్టింపబడ్డారు, తానొక్కరే ఆ పనిని చేస్తున్నానని చెప్తే వారికి గర్వం ఉన్నట్లే. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

7) అసూయ:--
మనల్ని వేరొకరితో పోల్చుకుంటే మనం భూలోకంలోకి ఎందుకు వచ్చామో ఆ వచ్చిన లక్ష్యం లో వెనకబడిపోతాం. మనకున్న వాటితో తృప్తి పడాలి.

ఎవరైనా ఏదైనా సాధిస్తే, వారిని చూసి సంతోష పడడం నేర్చుకోవాలి,వారి నుండి స్ఫూర్తిని పొందండి, ఆత్మలోక ఆత్మలు అలానే జీవిస్తాయి, మనకున్నదానికి సదా దైవానికి కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి.

8) ఇతరులను నిందించడం:--
మనలో భాధ ఉంటే నే ఇతరుల్ని నిందిస్తాము, ముందు అదేమిటో తెలుసుకోండి, లోపాన్ని సరిచేసుకుని,మారడానికి ప్రయత్నించండి.

9) ప్రతికూలమైన ఆలోచనలకు బానిస అవడం:--
-ve గా ఆలోచించే వ్యక్తులు సమస్య ఏది లేకపోయినా వారే సృష్టించుకుని బాధపడుతుంటారు, వారి మీద వారు జాలి పడుతూ, ఎప్పుడూ నిరాశ, నిస్పృహలతో వుంటారు.

10) అసహనం:--
అసహనం వల్ల నిగ్రహం కోల్పోతారు,సదా సహనంగా ప్రశాంతంగా ఉండండి.

వీటన్నింటిని మనం గుర్తించాలి,పైన చెప్పిన వాటిలో మనలో ఏ భావం ఉన్న మనం ప్రతికూలంగా ఉన్నట్లే.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment