🌹. మనోశక్తి - Mind Power - 78 🌹
Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. Q 75:-- మానవుడు vs జంతుజాతి 🌻
Ans :--
1) భూమిని ఒక చెట్టుతో పోలిస్తే మానవజాతిని వేర్లుగానూ, ఇతర జీవజాతుల్ని చెట్టులోని ఇతర భాగాలతో పోల్చవచ్చు.
2) చెట్టులోని ఏ భాగానికి హాని జరిగినా ఆ బాధ చెట్టంతా భరించాల్సి ఉంటుంది. చెట్టులోని ఒక వేరుని నరికి వేసిన చెట్టుకి నష్టం వాటిల్లుతుంది.
3) భూమి మీద మానవుడు నేటి సమాజంలో అగ్రభాగాన వున్నాడు, అలాగని అతడికి భూమి మీద ఏ జీవజాతిని చంపే అధికారం లేదు.
మానవుడు ఏ జీవాత్మ ను చంపినా భూమి యొక్క గరిష్ట ఫ్రీక్వెన్సీ ని అందుకోలేడు.
4) జీవహింసకు పాల్పడేవాడు దేవుని మార్గంలోకి ప్రవేశించలేడు, మనం ఒక జీవాత్మను చంపితే మనల్ని మనమే దెబ్బతీసుకున్నట్టు అవుతుంది.
5) జీవహింస వల్లే మతవిద్వేషాలు యుద్ధాలు పేరిట మానవజాతి ఒకరిని ఒకరు చంపుకుంటుంది. అంటే చెట్ల వేర్లు తెగిపోతున్నాయి. భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవుడిదే.
ఎప్పుడైతే మానవుడు జీవహింస మానివేస్తాడో అప్పుడే పురోగతి ని సాధిస్తాడు.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment