శివగీత - 21 / The Siva-Gita - 21

Image may contain: 1 person
🌹. శివగీత  - 21  / The Siva-Gita - 21 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము
🌻. విరజాదీక్షా లక్షణ యోగము - 5 🌻

అగస్త్య ఉవాచ:-
శుక్ల పక్షే చతుర్దశ్యా - మష్టమ్యా వా విశేషతః,
ఏకా దశ్యాం సోమవారే - ఆర్ద్రాయాం వా సమర భేత్ 20

అగస్త్యుడు నుడుపు చున్నాడు: -
శుక్ల పక్షము చతుర్దశి యందు గాని ,లేదా అష్టమి యందును గాని,
 అధవా ఏకాదశి యందు గాని లేదా ఆర్ద్రా నక్షత్ర యుక్త సోమవారమందు గాని యీ పాశుపత వ్రతమును ప్రారంబించ వలెను.

యం వామ మాహుర్యం రుద్రం -శాశ్వతం పరమేశ్వరమ్,
పరాత్పరం పరం బాహుం - పరాత్పర తరం శివమ్ 21

బ్రహ్మాణాం జనకం విష్ణో ర్వహ్నే - ర్వాయో స్సదాశివమ్,
ద్యాత్వాగ్ని నావ సధ్యాగ్నిం - విశోద్యచ పృధ క్ప్రుధక్. 22

పంచ భూతాని సం యమ్య - దగ్ద్వా గుణ విధి క్రమాత్,
మాత్రాః పంచ చత స్రశ్చ - త్రిమాత్రా ద్విస్తతః పరమ్ 23

ఏక మాత్ర మమాత్రం చ - ద్వాదశాం తవ్య వస్తితమ్,
స్థిత్యాం స్థాప్యా మృతో భూత్వా - వ్రతం పాశుపతం చరేత్. 24

ఏ దేవుడి ని రుద్రుని గాను, పరమేశ్వరుని గాను, పరాత్పరు ని గాను, శివుని గాను, విష్ణ్వగ్ని వాయువులకు - 

జన్మ నొసంగిన వానిన గాను ఏ పెద్దలు అంగీకరించుచున్నారో అటువంటి భగవంతుని మొట్ట మొదట  ధ్యానించి వహ్నిని బూజించి పంచ భూతంబు లను నియమించి 
పంచ చతుస్త్రి ద్వైక (ఐదు- నాలుగు - మూడు - రెండు -ఒకటి ) మాత్రల చేత నైన గాని, ఆ మాత్రగ నైనా గాని,  ద్వాద శ్వాంత స్థితుండై యమృతం డై యీ పాశుపత  వ్రతము ననుష్టించవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 21 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 03 : 
🌻 Viraja Deeksha Lakshana Yoga - 5 🌻

The Lord whom scriptures call as Rudra, Parameshwara (greatest lord), Paratpara (higher than the highest), Shiva (auspicious), the father of Vishnu, Agni, Vayu kind of gods; that bhagawan Sadashiva has to be meditated upon. 

Then one should worship the fire, and subdue the five elements. 

One should follow this Pashupata penance by following the mantras of any of the type called 'Pancha chatushtridwaika' (five­four­three­two­one).

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment