శ్రీ మదగ్ని మహాపురాణము - 72


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 72 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


ప్రథమ సంపుటము, అధ్యాయము - 30
🌻. అధ మండల విధి - 1 🌻

అథ త్రింశోధ్యాయః.

అథ మణ్డలవిధిః

నారద ఉవాచ :

మధ్యే పద్మే యజేద్బ్రహ్మ సాఙ్గం పూర్వేబ్జనాభకమ్‌ | ఆగ్నేయేబ్జే చ ప్రకృతిం యామ్యేబ్జే పురుషంయజేత్‌. 1

పురుషాద్దక్షిణ వహ్నిం నైరృతే వారుణనిలమ్‌ | ఆదిత్యమైన్దవే పద్మే బుగ్యజుశ్చే శపద్మ కే. 2

ఇన్ద్రాదీంశ్చ ద్వితీయాయాం పద్మే షోడశకే తథా | సామాథర్వాణమాకాశం వాయుం తేజ స్తథా జలమ్‌. 3

పృథివీం చ మనశ్చైవ శ్రోత్రం త్వక్చక్షురర్చయేత్‌. | రసనాం చ తథా ఘ్రాణం భూర్భువశ్చైవ షోడశమ్‌. 4

నారదుడు చెప్పెను : భద్రమండలము మధ్య నున్న కమలమున అంగదేవతాసహితబ్రహ్మను పూజింపవలెను.

తూర్పున నున్న కమలమున పద్మనాభుని, ఆగ్నేయమున నుద్న కమలమున ప్రకృతిని, దక్షిణమున నున్న కమలమున పురుషుని దక్షిణభాగమున అగ్నిదేవతను, నైరృతిదిక్కున నిరృతిని, పశ్చిమదిక్కున నున్న కమలమున వరుణుని, వాయవ్యదిక్కునం దున్న కమలమున వాయువును, ఉత్తరదిక్కునందున్న కమలమున ఆదిత్యుని, ఈశాన్యదిక్కునందున్న కమలమున బుగ్వేదయజుర్వేదములను పూజింపవలెను.

రెండవ ఆవరణమునందు ఇంద్రాది దిక్పాలకులను, షోడశదలకమలమున క్రమముగా సామవేద, అథర్వవేద, ఆకాశ, వాయు, తేజో, జల, పృథివీ, మనః, శ్రోత్ర, త్వక్‌, నేత్ర, రసనా, ఘ్రాణ, భూర్లోక, భువర్లోకములను పూజింపవలెను.

మహర్జనస్తపఃసత్యమత్యగ్నిష్టోమమేవ చ | తథాగ్నిష్టోమకం చోక్థం షోడశీం వాజపేయకమ్‌. 5

అతిరాత్రం చ సంపూజ్య తథాప్తోర్యామమర్చయేత్‌ | మనోబుద్ధిమహఙ్కారం శబ్ధం స్పర్శం చ రూపకమ్‌. 6

రసం గన్ధం చ పద్మేషు చతుర్వింశతిషు క్రమాత్‌ | జీవం మనో ధియం చాహం ప్రకృతిం శబ్దమాత్రకమ్‌.

వాసుదేవాదిమూర్తీశ్ఛీ తథా చైవ దశాత్మకమ్‌ | మనః శ్రోతం త్వచం ప్రార్చ్య చక్షుశ్చ రసనం తథా. 8

ఘ్రాణం వాక్పాణిపాదం చ ద్వాత్రింశద్వారిజేష్విమాన్‌ | చతుర్థావరణ పూజ్యాః సాఙ్గాః సపరివారకాః. 9

పిమ్మట తృతీయవరణము నందలి, ఇరువదినాలుగు దళముల కమలమున క్రమముగ మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక, అగ్నిష్టోమ, అత్యగ్నిష్ణోమ, ఉక్థ, షోడశీ, వాజపేయ, అతిరాత్ర, ఆప్తోర్యామ, వ్యష్టిమనో, వ్యష్టిబుద్ధి, వ్యష్ట్యహంకార, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, జీవ, సమస్టిమనః, సమష్టిబుద్ధి (మహత్తత్వ), సమష్ట్యహంకార, ప్రకృతులను పూజింపవలెను. వీటి అన్నింటియొక్క స్వరూపము శబ్దమాత్రమే. అనగా కేవలము వీటి పేరులు చెప్పి నమస్కరించిన చాలును; మూర్తులను ధ్యానింపవసరము లేదు.

ఇరువదియైదవ అధ్యాయములో చెప్పిన వాసుదేవాదిమూర్తులను తొమ్మిందింటిని, దశవిధప్రాణములను, మనో, బుద్ధ్య, హంకార, పాయు, ఉపస్థలను, శ్రోత్ర, త్వక్‌, నేత్ర, రసనా, ఘ్రాణ, వాక్‌, పాణి, పాదములను, ఈ ముప్పదిరెండింటిని, ముప్పదిరెండు దళముల కమలమున ఆర్చన చేయవలెను. ఇవి నాల్గవ అవరణమునందలి దేతవలు. ఈ ఆవరణమున సాంగసపరివార దేవతాపూజ చేయవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment