నారద భక్తి సూత్రాలు - 70

Image may contain: 2 people
🌹. నారద భక్తి సూత్రాలు - 70 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. చలాచలభోధ
తృతీయాధ్యాయము - సూత్రము - 41

🌻. 41... తస్మిన్‌ తజ్జనే భేదాభావాత్‌ ॥ - 1 🌻

భగవంతునికి భక్తునికి భేదం లేదు. జీవాహంకారం ఉన్నంత వరకు జీవుడిలో భేదభావం కొనసాగుతూ ఉంటుంది. ఆ జీవాహంకారమనే అడ్డు తొలగించుకుంటే భగవదైక్యమె..

ఆవరణలెని భగవత్తత్త్వం ఆవరణ కలిగిన భగవత్తత్త్వాన్ని సహజంగాను, నిరంతరంగాను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఆవరించబబడ్డ భగవత్తత్త్వమే జీవాహంకారంగా వ్యక్తమైంది. ఆవరణ ఉన్నంతసేపు భగవంతుని ఆకర్షణకు లోబడనేరదు.

జీవాహంకారాన్ని భక్తిసాధన చేత తొలగించుకుంటూ పోతూ భగవంతుడితో అనుష్టాన పూర్వకంగా అనుసంధానం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తూ పోతే, భగవత్తత్త్వ ఆకర్షణకు అనుకూలత ఏర్పడుతుంది. సాధన చరమాంకంలో భగవదైక్యం లభిస్తుంది.

చిత్తంబు మధురిపు శ్రీపాదములయందు
పలుకులు హరిగుణ పఠరనమంద
కరములు విష్ణు మందిర మార్దనములంద
చెవులు మాధవకథా శ్రవణ మంద
చూపులు గోవిందరూప వీక్షణ మంద
శిరము కేశవ నమస్కృతుల యంద
పదము లీశ్వర గేహ పరిసర్పణములంద
కామంబు చక్రి కైంకర్యమంద
-భాగవతం, అంబరీషోపాఖ్యానం

జీవుడు తన ఇంద్రియాలను, విషయాల మీదికి పోనీయకుండా పై విధంగా భగవత్తత్త్వమందే నిలుపుట చేత జీవుడు కైంకర్య పద్ధతిగా లేకుండా పోయి భగవత్తత్త్వమే మిగులుతుంది. దీనిని భగవదైక్యమని అంటారు.

దీనిలో అన్వయ సాధన, వ్యతిరేక సాధన కనబడుతున్నది. అన్వయ మంటే భగవంతునికి దగ్గరగా జరగడానికి చేసే సాధన.

వ్యతిరేక సాధన అంటే, భగవంతుడిని చెరడానికి అడ్డుగానున్న ఆటంకాలను తొలగించు కోవడం అనగా విరోధంగా ఉండే వాటిని త్యజించడం, కొత్తగా ఆటంకాలు రాకుండా చూసుకోవడం కూడా. ఇటువంటి సాధనకు ఉపాయాలున్నాయి. కొన్ని ఉపాయాలు విశిష్టాద్వైత మతంలో ఇలా చెప్పబడ్డాయి.

భగవంతునికి ఐదు స్వరూపాలున్నాయి.

1. జీవ స్వరూపం :
ఇది జీవాహంకార రూప ఆవరణ కలిగినది.

2, పర స్వరూపం :
ఇది వ్యాపకంగా ఉంది అన్ని లోకాలలో వ్యూహ రూపంగా, భూలోకంలో వివిధ అవతారాల రూపంగా, అంతర్వామిగా, అర్చావతారంగా ఉందే స్వరూపం.

3. ఉపాయ స్వరూపం :
దీనిని అన్వయ సాధనగా వివరించబోతున్నాం.

4. విరోధ స్వరూపం :
దీనిని వ్యతిరేకాన్ని తొలగించుకోవడానికి వివరించ బోతున్నాం.

5. పురుషార్థ స్వరూపం :
జీవుడు భగవంతుని చేరుకోవడానికి ముందస్తుగా ధర్మార్ధ కామాలను ఏ విధంగా ఆచరించాలో తెలుసుకొని కైవల్యం, లేక పరమపదం పొందే స్వరూపం.

ఈ ఐదింటిని అర్ధ పంచక నిర్ణయమని పేర్కొని, మరింత స్పష్టంగా వివరిస్తారు విశిష్టాద్వైతులు. ముందుగా విరోధ స్వరూపాన్ని వివరించి తరువాత ఉపాయ స్వరూపాన్ని వివరించుకుందాం. ఏటిని విశిష్టాద్వైత పద్ధతి అని గుర్తెరిగి గ్రహిద్దాం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment