˜”*°• భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 88 •°*”˜


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 88 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పరాశర మహర్షి - 7 🌻

35. సంసారం అనాది. జీవుడికి సంసారంతో సంబంధం అనాది. అప్పటి నుంచీ ఉంది. దానిని తెంచుకోవటం స్వార్థం కాదు. అదే కర్తవ్యం.

36. ఆహారం తినటము, సుఖపడటము, నిద్రపోవటము, పిల్లలను కనటము – ఇంతే తప్ప నాకు ఇంతకుమించి ఇంకేదీ లేదనుకునేవాడు శీఘ్రంగా నశిస్తాడు. మనిషిపొందే దుఃఖాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సుఖమేమో చాలా అల్పం.

37. ఎప్పుడో ఒక్క ఘడియమాత్రమే ఉండి, పొయే సుఖదుఃఖాలు యథార్థమని ఎవరు నమ్ముతారో – అవి యథార్థమని ఎవరు భావిస్తారో – వాళ్ళు శాస్వతంగా అందులోనే ఉండిపోతారు. అది సత్యమనుకుంటూ అందులోనే ఉంటారు. అది అస్త్యమనుకుంటే, అప్పుడే అందులోంచీ బయటికివెళ్ళిపోతారు.

38. సుఖదుఃఖములందు సత్యత్వబుద్ధి, నిత్యత్వబుద్ధి ఎవడియందుంటాయో వాడికి నిత్యమూ సుఖదుఃఖాలు ఉంటూనే ఉంటాయి. అవి అనిత్యము అని తెలుసుకోవాలి. ఎందుకంటే, ‘నా ఉనికే అనిత్యమయితే, నాకుండే సుఖదుఃఖాలు నిత్యము ఎలా అవుతాయి? నేనే అనిత్యము కదా!’ అన్న వివేకం కలగాలి.

39. ‘మిత్రులు, భార్య, భ్రాతలు, పుత్రులు వీళ్ళంతా మనిషికి నిజకార్యపరులు. వాళ్ళువాళ్ళ కార్యంకోసం నిన్ను ఆశ్రయించి ఉన్నారు.

40. కాని నీ యోగ క్షేమములకొరకు నిన్ను ఆశ్రయించి లేరు’ అని గుర్తుంచుకోవాలి. ‘నా భార్యకు నా మీద చాలా ప్రేమ’ అంటాడు ఒకడు. అయితే భార్య తనకొరకై నిన్ను ప్రేమిస్తుంది. మనమెప్పుడూకూడా మనకు ఉపయోగపడేవస్తువునే ప్రేమిస్తాము కదా! ఇందులో కొద్దిగా కూడా అబద్ధం లేదు.

41. జాగ్రత్తగా ఆలోచిస్తే, తండ్రికి పుత్రులమీద ప్రేమ, పుత్రులకు తండ్రి మీద ఉండే ప్రేమ అమతా స్వార్థంతో కూడుకున్న ప్రేమయే. అటువంటి ప్రేమని మోహం అంటారు. అటువంటి ప్రేమ సత్యం కాదు. కాబట్టి వాళ్ళు(సంబంధం ఉన్నవారందరూ) నిజసాత్వికులు.

42. వాళ్ళు వారి పనులకోసమనే తనను ఆశ్రయించి ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి! ‘బోధను నువ్వుపొందితే అది ఆత్మత్రాణం. నిన్ను నీవు రక్షించుకోవటం బోధలో – అంటే జ్ఞానంలో – ఉంది. ఈ బోధయే మహాలక్ష్మి. ఇట్టి అభేదదృష్టి కలిగినవాడే ధీరుడు.

43. ధైర్యలక్ష్మి-జ్ఞానలక్ష్మిని కలిగిఉన్నవాడు, దానినెప్పుడూ వదలకూడదు. ఎట్టిపరిస్థితులలోనూ ఆ ధైర్యాన్ని, ఆ జ్ఞానాన్ని వదకూడదు’ అని సారాంశం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment