🌹. శివగీత - 36 / 🆃🅷🅴 🆂🅸🆅🅰-🅶🅸🆃🅰 - 36 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
పంచామాధ్యాయము
🌻. రాముని యస్త్ర ప్రాప్తి - 6 🌻
అనేక శైల సంబద్దె - సేతౌ యాంతు వలీ ముఖాః,
రావణం సగణం హత్వా - తా మానయ నిజ ప్రియామ్ 36
శస్త్రై ర్యుద్దే జయో యత్ర- తత్రాస్త్రాణి న యోజయేత్,
నిరస్త్రే ష్వల్ప శస్త్రేషు పలాయన పరేషుచ 37
అస్త్రాణి ముంచ న్దివ్యాని - స్వయమేవ వినశ్యతి ,
అధ వాకిం బహూక్తేన - మయైవో త్పాదితం జగత్ 38
మయైవ పాల్యతే నిత్యం - మయా సంహ్రియతే సిచ,
అః మేకో జగన్మ్రుత్యు - ర్మ్రుత్యో రపి మమీ పతే! 39
గ్రసే హమేవ సకలం - జగదేత చ్చరాచరమ్,
మమ వక్త్ర గతా స్సర్వే - రాక్షసా యుద్ద దుర్మదా: 40
నిమిత్త మాత్ర స్త్వం భూయా: -కీర్తి మాస్స్యాసి సంగరే,
ఇతి శ్రీ పద్మ పురాణే శివ గీతాయాం పంచమోధ్యాయః
వనచరులు అనేకములైన గొప్ప గొప్ప రాతి గుండ్లతో సముద్రమునకు వంతెన గట్టి నీతో బాటు లంకకు వచ్చెదరు.
నీవు బృత్య బంధము మిత్రుల సమూహముతోడ గలసి లంకాధి పతి హత మార్చి ప్రియురాలగు సీతను తీసుకొని రమ్ము సామాన్య శస్త్రములతో నే రణ రంగములో విజయము లభించు చుండగ అక్కడ మహాస్త్రములను ప్రయోగింప కూడదు.
శత్రువులు పరుగెత్తు చుండగను ఆయుధాలు లేని వారైనను, కొద్ది మాత్ర శస్త్రములున్న వారైనను అట్టి వారిపై అస్త్రముల ప్రయోగించిన యెడల ప్రయోగించిన వాడే వినాశనమునకు గురి యగును. పైన పేర్కొనిన వారిపై మహాస్త్రములను ప్రయోగింప వలదు . వేయేల, ఈ జగత్తంత యును నాతోనే సృష్టిం బడినది, నా చేతనే రక్షించ బడినది.
నా చేతనే సంహరింప బడినది, నేనే మృత్యువునకు కూడా మృత్యువును, సమస్త స్థిర చరాత్మక ప్రపంచ మంతయును మ్రింగెదను. (అత్ర అనేన హేతునా లీయతే గమ్యతే యత్ర సచ రాచరం తల్లింగ మితి జంజ్నితమ్ ) రణమందు మదించిన రాక్షసులందరు నా నోట బడని వారలే . నిమిత్తమునకు మా తరము నీ వుండుము.
శాశ్వతమైన అపారమగు యశస్సును నీవు పొందగలవు.
ఇది వ్యాసోక్త సంస్కృత పద్మ పురాణాంతర్గతం బైన శివ గీతలో ఐదవ అధ్యాయము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 🆃🅷🅴 🆂🅸🆅🅰-🅶🅸🆃🅰 - 36 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 05 :
🌻 Ramaya Varapradanam - 6 🌻
Those Vanaras would create a bridge over the ocean by using huge rocks and stones. and would cross the ocean along with you. You use their forces in slaying Ravana & his troops and bring your beloved back from captivity.
When chances of victory with ordinary weapons itself exist, then there one should not hurt divine weapons. When enemies are fleeing away, or when enemy is devoid of weapons, or when enemy has limited weapons with him; on such enemies one should not hurl the supreme weapons.
If hurled, then the wielder himself would become annihilated. Hence do not use the celestial weapons on aforementioned categories of enemies. Well, this entire universe has been created by me, has been protected by me and by me only it has been destroyed.
It's I who is the death of even death. It's I who swallows the entire mobile and immobile creation. All those demons who would die in the fierce war, all have actually been swallowed by me in reality.
You are just an instrument, and you would gain immense and eternal glory for yourself.
Here ends the chapter 5 of Shiva Gita of Padma Purana Uttara Khanda
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment