కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 39


🌹.  కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 39  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి - 3 🌻

ప్రత్యక్ష ప్రమాణంగా ఆత్మను నిరూపించలేము. అంటే ఎలాగండీ? ఆత్మ కదలదు. మొదటి లక్షణం.

రాయి కదలదు. మరి కదలనివి భూమండలంలో ఏం తెలుసంటే? రాళ్ళు కదలవు. కొండలు కదలవు. ఆత్మ కొండవలే వుంటుంది అన్నామనుకోండి. తప్పు. పోయింది. ఆత్మ అన్నింటినీ కదిలించగలదు అన్నాం. ఆత్మ అన్నింటినీ కదిలించగలదు అంటే? వాయువు అన్నింటినీ కదిలించగలదు కదా.

కాబట్టి ఆత్మ వాయువు వలే వుంటుంది అన్నామనుకోండి. పొరపాటు. తేడా వచ్చేసింది. అలా కుదరదు. మరి ప్రత్యక్ష ప్రమాణానికి ఇంకేం చెప్పారు? నిప్పు - పొగ. ఎక్కడైనా సరే ఒక పొగ వస్తోందంటే నిప్పుంది అని ఎవరైనా గానీ చెప్తారనమాట. కానీ అట్లా అనుమాన ప్రమాణంతో కూడా ఇది వీలుకాదు.

ఇది రెండవ ప్రమాణం అనమాట. మనం దగ్గరికి వెళ్ళి నిప్పుందో లేదో చూడలేదు. దూరం నించీ పొగ వస్తోందని చూశాం. అది వంటిల్లు కావచ్చు, ఎక్కడైనా దూరప్రదేశంలో కావచ్చు.

తద్వారా నీవేం తెలుసుకున్నావు? వాసన చేత అక్కడ వంట జరుగుతోందని, వంట జరగాలంటే నిప్పుందని, వెళ్ళి చూడక పోయినప్పటికీ కూడా ఊహించావు. ఇదేమిటిదీ? అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణంతో కూడా దీనిని మనం నిర్ణయించలేము.

రెండు ప్రమాణాలకి సంబంధించినటు వంటి ఉపమానాలని ఇక్కడ వేశారనమాట. గ్రుడ్డివారు ఏనుగు దగ్గరికి వెళ్ళారు. నలుగురు గ్రుడ్డివారు ఏనుగు దగ్గరికి వెళ్ళారు, నాలుగు వైపుల నించి ఏనుగును పట్టుకోవడానికి.

ఒకాయన తొండాన్ని పట్టుకున్నాడు. పట్టుకుని ఏమన్నాడు? ఏనుగంటే మెత్తగా వుంటుంది అన్నాడు. ఒకాయన తోకను పట్టుకున్నాడు. ఏనుగంటే కుచ్చులాగా వుంటుంది అన్నాడు. ఒకాయన కాళ్ళు పట్టుకున్నాడు.

ఏనుగంటే స్థంభమువలే వుంటుందీ అన్నాడు. ఒకాయన ప్రయత్నించి ఏనుగుమీదకి ఎక్కాడు. ఏనుగంటే ఎత్తుగా వుంటుందీ అన్నాడు. అప్పుడేమయిందీ? ఈ నాలుగు లక్షణాలు ఏనుగుయొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని మనకి ఇవ్వడం లేదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

29 Aug 2020

No comments:

Post a Comment