శివగీత - 80 / The Siva-Gita - 80


🌹.   శివగీత - 80 / The Siva-Gita - 80   🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

దశమాధ్యాయము

🌻. జీవ స్వరూప నిరూపణము - 6 🌻


వాలాగ్ర శత భాగస్య - శతధా కల్పిత సయచ |

భాగో జీవ స్స విజ్ఞేయః సచానన్త్యాయ కల్పతే 26


కదంబకు సుమోద్బుద్ద - కేసరా ఇవ సర్వతః |

ప్రసృతా హృదయాన్నానడ్యో - యాభి ర్వ్యాప్తం శరీరకమ్ 27


హితం బలం ప్రయచ్చన్తి - యస్మాత్తేన హితాః స్మృతాః |

ద్వాసప్తతి సహస్రైస్తా - స్సంఖ్యాతా యోగ విత్తమైః 28


హృద యాత్తస్తు నిష్క్రాంతా - యథా ర్కా ద్రశ్మయస్తథా |

ఏకోత్తర శతంతాసు - ముఖ్యా విష్వగ్వి నిర్గతా: 29


ప్రతీంద్రియ దశ దశ - నిర్గతా విషయోన్ముఖాః |

నాడ్యః కర్మాది హేతూత్ధాః - స్వప్నాది ఫలభుక్తయే 30


వెంట్రుక యొక్క కొసభాగమున నూరు భాగములుగా చేసి అందును నొక భాగమును మరో నూరు భాగములు చేసిన అందొక దాని యంశ పరిమాణము కలిగి బీవుడుండును.

అట్టి జీవుడే యనంతుడ పరి ఛిన్నుడని అందురు. కడిమి పువ్వులో ఆవరించుకొనియున్న కింజల్కములవలె వక్షము నుండి శరీర మంతటను నాడులు వ్యాపించుకొని యుండును, హితమును శక్తిని ఒసగునని కనక హృదయమునుండి అంతట వ్యాపించి వెలువడినవి.

కర్మము, అదృష్టము, వీటిననుసరించి పుట్టిన నాడులు స్వప్నాది ఫలానుభవము కొరకు ప్రతీంద్రియము నుండి పది పదిగా విషయాభి ముఖములై బయల్దేరు చుండును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹   The Siva-Gita - 80   🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj


Chapter 10
🌻 Jeeva Swaroopa Niroopanam -6
🌻

If the diameter of the tip of a single hair is measured, and that size (diameter) is divided by 100, whatever becomes the resultant size, that is the size of the Jiva seated inside the heart.

That super micro Jiva himself is the infinite Purusha. From the chest all over the body the nerves remain spread. The nerves from heart are 72,000 in number.

Out of them only 101 are primary ones which spread outwards all over the body originating from the heart as like as the rays of the sun.

Following the Karma, Fortune, etc., nadis which originate, they help in the enjoyment of fruits from acts in dreams etc. and hence from every Indriya (organ) they are connected in a group of ten in number and spread.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


02 Oct 2020

No comments:

Post a Comment