శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 15 / Sri Lalitha Chaitanya Vijnanam - 15

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 10 🌹


🌹.    శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 15 / Sri Lalitha Chaitanya Vijnanam - 15   🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

అష్టమిచంద్ర విభ్రాజ దళికస్తల శోభిత

ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక

🌻 15. 'అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా' 🌻

అష్టమి చంద్రుడు అర్ధచంద్రుడు. సగము దృశ్యముగను, సగము అదృశ్యముగను, అష్టమినాడు చంద్రుడు గోచరించును. సృష్టి యందు ప్రకృతి పురుషులు యిట్లే యుందురు. కనపడునది మాత్రమే చూచుట అసంపూర్ణ దృష్టి.

కనపడునది ఆధారముగ కనపడనిది ఊహించవలెను, భావించవలెను. పూర్ణమైన చంద్రబింబము సగము భాగము కనుపించనపుడు ఆ మిగిలిన భాగము లేకుండునా? ఉన్నది. అగుపడక ఉన్నది.

అటులనే సృష్టియందు దివ్యమైనది అగుపడక ఉన్నది. లేదు అనుకొనుట అల్పత్వము. అర్ధ చంద్రబింబము దీనినే సంకేతించుచున్నదా అన్నట్లు ఉండును. శుక్లాష్టమినాడు కనపడిన భాగము కృష్ణాష్టమినా డగుపడదు.

అటులనే కృష్ణాష్టమి నాడు అగుపడు భాగము శుక్లాష్టమినాడగు పడదు.

రెండును అర్ధచంద్రాకారములే అయినను, ఒకటి కాదు. రెండు తత్త్వములు సృష్టిలో ఒకదానికొకటి ఆలంబనములు. ఒకటి పెరుగుచున్న, రెండవది తరుగుచుండును.

పదార్థము పెరుగుట జరుగుచున్న కొలది, పరమార్థము అదృశ్య మగుచుండును. అటులనే పరమార్ధము పెరుగుచున్న కొలది పదార్థము అదృశ్య మగుచుండును. రెండునూ సమతూకముగా నున్న స్థితిని పూర్ణయోగ మందురు. అష్టమి అట్టి యోగమునకు సంకేతము. అర్ధనారీశ్వరుని తత్త్వము దీనినే బోధించును.

గోచరింపనివాడు అవ్యక్త బ్రహ్మము. గోచరింపబడునది అతని వెలుగు. అదియే అమ్మవారు. తాను గోచరించి, గోచరింపని వానిని తెలియబరచు చుండును. అమ్మవారు, అయ్యవారి శోభనమూర్తి. ఆమెను పూజించుట ద్వారా ఆయనను రుచి చూడవచ్చును. ఆయన కనపడుట ఎపుడును ఆమెగనే యుండును. కేనోపనిషత్తు ఈ విషయమును ప్రతిపాదించు చున్నది.

అష్టమి కళను అమ్మవారిగ ఆరాధించుచు, మిగిలిన కనబడని అర్ధచంద్ర బింబమును అయ్యవారిగ ఊహించుచు ధ్యానము చేయు మార్గ మిచట తెలుపబడుచున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 15 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Aṣṭamī -candra-vibrāja-dhalika-sthala-śobhitā अष्टमी-चन्द्र-विब्राज-धलिक-स्थल-शोभिता (15) 🌻

Her forehead appears like the moon on the eighth day. Eighth day from the full moon or new moon is called asḥṭamī.

The moon appears beautiful with even curves on both sides on eighth lunar day.
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


02 Oct 2020

No comments:

Post a Comment