🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 62 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 12 🌻
253. మానవుని అర్థస్పృహ ద్వారా యీ సంస్కారములు పైకి లేచినప్పుడు కలలో అస్పష్టమైన సూక్ష్మరూపములుగా వస్తువులను ప్రాణులను సృష్టించు చున్నవి .
సినీఫిల్ము ...మనస్సు
ఫొటోలు ... నిద్రాణసంస్కారములు
తెర పై ప్రదర్శనము "కల" అనెడి డ్రామా .
254. మానవుడు స్వప్నావస్థలో , స్వప్ననాటకములో తగుల్కొని తాను ఆ నాటకకర్తగను , కథానాయకునిగను
పాత్రలు ధరించుటయే గాక తన స్వప్ననాటకములో సూక్ష్మాతి సూక్షరూపములుగానున్న వస్తువులతోను ప్రాణులతోను సన్నిహితముగా హత్తుకొని వుంటున్నాడు .
ఈ సూక్ష్మరూపముల సృష్టి కేవలము మానవుని పూర్వ, ప్రస్తుత జన్మల యొక్క స్వీయ సంస్కారముల వ్యక్తీకరణ ఫలితమే.
255. స్వప్నావస్థలో తాను చూచిన రూపములను, కలిసికొన్న రూపములను మెలుకువ వచ్చిన తరువాత స్మృతికి తెచ్చుకొన్నప్పుడు, అవి, ప్రస్తుత జీవితములో తాను ఏ రోజు కారోజు స్థూలరూపములలో నున్న వస్తువులను ప్రాణులను మానవులను ఎఱుకతో కలిసికొన్న సమావేశములను గుర్తుకు తెచ్చుచున్నవి.
అంతియే కాక, వెంటనే వచ్చు జన్మములోగాని, లేక, కొంతకాలము గడచిన తరువాత వచ్చు జీవితము యొక్క సంబంధ _అనుబంధములను కూడా స్థాపించు చుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
02 Oct 2020
No comments:
Post a Comment