భోగి పండుగ విశిష్టత - శుభాకాంక్షలతో Significance of Bhogi Festival - Best Wishes


🌹. భోగి పండుగ శుభాకాంక్షలు అందరికి. 🌹

🔥.ఈ భోగి మంటలు మన జీవితాలలో వున్న చెడును తొలగించి, వెలుగును, దివ్యత్వమును నింపుగాక. 🔥

ప్రసాద్‌ భరద్వాజ, జ్యోతిర్మయి.

🌹. Subhakankshalu on Bhogi Festival to all. 🌹

🔥. Let Bhogi Fires Clear All negativeness from our Life and Bring Light and Divinity. 🔥

Prasad Bharadwaj, Jyothirmayi.




🌹. భోగి పండుగ విశిష్టత - శుభాకాంక్షలతో 🌹

📚. ప్రసాద్‌ భరధ్వాజ


తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. ఈ పండుగ మూడు రోజులు ఉంటుంది. తొలి రోజు బోగితో ప్రారంభమవుతుంది. భోగి పండుగ అనే పదానికి 'తొలినాడు' అనే పేరు ఉంది. అనగా పండుగకు తొలినాడు అని అర్ధం.తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. ఈ పండుగ మూడు రోజులు ఉంటుంది. తొలి రోజు బోగితో ప్రారంభమవుతుంది. భోగి పండుగ అనే పదానికి ‘తొలినాడు’ అనే పేరు ఉంది. అనగా పండుగకు తొలినాడు అని అర్ధం. భోగి రోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దారిద్ర్య దేవతను తరిమినట్లేనని హిందువుల విశ్వాసం.

🍀. భోగి పళ్లు ఎందుకు పోస్తారు?

భోగి అనగానే గుర్తుకు వచ్చేది భోగి పళ్ళు. ఈ పళ్ళను పోయడంలో అంతరార్ధం ఏమిటి? భోగి నాడు భోగి పళ్ళు అనే పేరుతో రేగి పండ్లను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టు, రేగి పండ్లు శ్రీ మన్నారాయణ స్వామి ప్రతిరూపం. వాటిని తల మీద పోయడం వలన శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి, దిష్టి తొలుగుతుందంటారు. మనకు కనిపించదు కానీ తల పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందటారు. ఈ భోగి పండ్లను పోస్తే పిల్లలు జ్ఞానవంతులవుతారటారు.

🍀. భోగి అని ఎందుకు పిలుస్తారు?

దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దూరం అవటం వల్ల భూమిపై చలి పెరుగుతుంది. ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు రోజు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు. ఈ మంటలు వేయడం వలన భోగీ అనే పేరు వచ్చింది.

🍀. బోగి మంటలు ఎందుకు వేస్తారు?

సాధారణంగా అందరు చెప్పేది… ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు… ఆరోగ్యం కోసం కూడా. ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది ఆ గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. సూక్ష్మక్రిములు నశిస్తాయి.

భోగి మంటల్లో పనికిరాని వస్తువులను కాల్చండి అని వింటుంటాం. పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కావు. ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు… మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి.

🌹 🌹 🌹 🌹 🌹


14 Jan 2022

No comments:

Post a Comment