శ్రీ శివ మహా పురాణము - 504
🌹 . శ్రీ శివ మహా పురాణము - 504 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 41
🌻. వివాహ మండపము -4 🌻
దేవేంద్రుడిట్లు పలికెను-
దేవ దేవా! లక్ష్మీపతీ! పుత్రశోకముతో పీడింపబడే ఈ విశ్వకర్మ ఈ మిషతో నన్ను నిశ్చయమగా చంపివేయును (31).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఇంద్రుని ఆ మాటను విని దేవదేవుడగు జనార్దనుడు నవ్వుతూ, ఆతనిని ఓదారుస్తూ, అపుడు ఇట్లు పలికెను (32).
విష్ణువు ఇట్లు పలికెను-
ఓ శచీపతీ! నీకు పూర్వశత్రువులగు నివాతకవచులను రాక్షసులు మహావిద్య యొక్క బలము చేతనే పూర్వము నిన్ను మోహింపజేసిరి (33). ఇంద్రా! నీవు నా ఆదేశముచే ఈ హిమవత్పర్వతునితో మాత్రమే గాక, ఇతర పర్వతములన్నింటితో విరోధమును నెరపి యుంటివి (34).
ఈ పర్వతములు ఆ వృత్తాంతమును స్మరించి మూఢులై మనలను మాయచే జయింపనిచ్చగించి యుండవచ్చును. కాని నీవు లేశ##మైననూ భయపడవలదు (35). ఇంద్రా! మనందరికీ ప్రభువు, భక్తవత్సలుడు అగు శంకరుడు నిస్సందేహముగా అన్ని విధములుగా క్షేమమును కలిగించగలడు (36).
బ్రహ్మ ఇట్లు పలికెను -
వికారమును పొందిన మనస్సుగల ఇంద్రుడు, విష్ణువు ఇట్లు మాటలాడుకొనుచుండగా, శివుడు లోకపు పోకడననుసరిస్తూ, వారితో నిట్లనెకను (37). హే హరీ! ఓ ఇంద్రా! మీరిద్దరు ఒకరితోనొకరు ఏమి మాటలాడు కొను చున్నారు? మహేశ్వరుడిట్లు వారితో పలికి, తరువాత నీతో ఇట్లనెను (38). ఓ నారదా! పర్వతరాజు ఏమనుచున్నాడు? సత్యమును చెప్పుము. వృత్తాంతమునంతనూ చెప్పుము. ఏమియూ దాచిపెట్టవద్దు (39).
హిమవంతుడు తన కుమార్తెను ఇచ్చునా? ఈయడా? ఆ విషయమును వెంటనే చెప్పుము. నీవచటకు వెళ్లి ఏమి చూసితివి? ఏమి చేసితివి? వత్స! ఇపుడా విషయమునంతనూ వెంటనే చెప్పుము (40).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ మహర్షీ! శంభుడిట్లు పలుకగా, మహా జ్ఞానివగు నీవు అచట మండపము నందు చూచిన దంతయూ రహస్యముగా చెప్పియుంటివి (41).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
14 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment