దేవాపి మహర్షి బోధనలు - 102


🌹. దేవాపి మహర్షి బోధనలు - 102 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 83. శ్రమ -ఫలితము 🌻


“శ్రమించుటకు వెనకాడకుము. మంచిని పెంచుము. సత్పురుషులను గౌరవించుము.” ఇది మా శాసనము. పుట్టిన ప్రతి పసిపాప అరచేతియందును ఈ శాసనము లిఖించవచ్చును.

దీని ననుసరించినవాడు దివ్య మార్గమును చేరగలడు. ఇదియే దీక్షగ సాగినవాడు పవిత్ర హృదయుడై దివ్యత్వమును చేరగలడు. పై శాసనమును మీరందరును గంట గంటకు మననము చేసుకొనుట మంచిది. ప్రపంచపు ఆటుపోటులలో మరపు సహజము.

ప్రక్కదారులు పట్ట కుండుటకై నిరంతర మననము ముఖ్యము. మననము, ఆచరణము పట్టుపడి నచో తుఫానుయందు కూడ నీవు స్థిరముగ యుందువు. చాల శ్రమ పడితిని, ఇంక ఎంత శ్రమపడ వలెను? అను వారికి మా సమాధానము 'యిక చాలు'. ఈ సమాధానము కోరువారు పురోగతిని వాయిదా వేసినట్లే.

మరియొక శ్రమ పడువాడు “ఈ శ్రమకు ఫలితమేమి?" అని భావించినచో మా సమాధానము 'ఇదిగో నీ ఫలము!' అని ఫలమందించి ఊర కుందుము. ఫలితము పునః ప్రారంభమే. ప్రశ్నలు లేక శ్రమించువారికి ఫలము దివ్యశరీర నిర్మాణము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


22 Jun 2021

No comments:

Post a Comment