శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 282 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 282 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 282 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 282 - 1 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 66. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః ।
సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్ ॥ 66 ॥ 🍀

🌻 282. 'సహస్రశీర్షవదనా' - 1 🌻


వెయ్యి శిరస్సులతో కూడిన వదనము కలది శ్రీమాత అని అర్థము. “సహస్ర” శబ్దము అనేకానేక అర్థములు కలిగియున్నది. సహస్రమనగా వేయి. సహస్రమనగా అనేకము. వేయి అనినపుడు ఒకటి తరువాత మూడు సున్నాలు వుండును. మూడు సున్నాలు మూడు లోకములకు సంకేతము కాగా, వాటికి పూర్వము నందున్నది ఒకటియే. ఒకటియే మూడు లోకములు వ్యాపించి యున్నదని అర్థము. సృష్టి మొత్తము ప్రజ్ఞ, శక్తి, పదార్థములతో చేయబడినది.

ఈ మూడింటికిని ఆధారమైనది ఒకటియే. కావుననే సహస్ర పదమును పరతత్త్వమును తెలుపుటకు వాడుదురు. ఒకటి మూడుగనై నాలుగు అగును. (1 + 3 - 4) తత్కారణముగ వాక్కు, వేదము, కాలము, స్వభావములు, ప్రధానముగ నాలుగు విభజనలు పొందును. ఒకటి నుండి పుట్టిన మూడు, నాలుగు నుండి ప్రతిబింబించుటచే ఏడగును. (1 + 3 + 3 7) ఇట్లు ఏడు లోకము లేర్పడును. ప్రధానముగ మూడే లోకము లైననూ ప్రతిబింబ ప్రభావమున ఏడుగ గోచరించును. సత్యలోకము, తపోలోకము, జనోలోకము ప్రధానముగ మూడు లోకములు.

ఈ మూడు లోకములు మహత్తు అను నాలుగవ లోకమునుండి సువర్లోకము, భువర్లోకము, భూలోకముగ ప్రతిబింబించును. ముందు మూడు లోకములు సూక్ష్మములు. తరువాత మూడు లోకములు = స్థూలములు. సూక్ష్మము స్థూలములోనికి వచ్చుటకు మహత్తు నడుచు చున్నది. అదృశ్యము దృశ్యమగుట, దృశ్యము అదృశ్యమగుట ఈ మహత్తు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 282 - 1 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 unmeṣa-nimiṣotpanna-vipanna-bhuvanāvalī |
sahasra-śīrṣavadanā sahasrākṣī sahasrapāt || 66 || 🍀

🌻 Sahasra-śīrṣa-vadanā सहस्र-शीर्ष-वदना (282) -1 🌻

Sahasra in this context means infinite and literally means thousand. She has countless heads and faces. The next two nāma-s also have the same meaning. Unable to describe Her supremacy by words, Vāc Devi-s have used an envisioned form here that encompasses summate supremacy. In fact, it can be considered as true in literal sense. Since the Brahman has so many acts to do in different places at the same time, the Brahman needed countless numbers of heads.

The countless number of heads for the Brahman is described in Veda-s and Upaniṣads. Bhagavad Gīta (XIII.13) says “He dwells in the world, enveloping all – everywhere, His hands and feet; present on all sides, His eyes and ears, His mouth and heads”.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


22 Jun 2021

No comments:

Post a Comment