2) 🌹. శివ మహా పురాణము - 416🌹
3) 🌹 Light On The Path - 163🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -44🌹
5) 🌹 Osho Daily Meditations - 33🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 93 / Lalitha Sahasra Namavali - 93🌹
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 93 / Sri Vishnu Sahasranama - 93🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -216 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 6-1
*🍀 5-1. ఉత్తమ భావములు - సంస్కారమే జీవుని నడిపించును. కనుక చిత్తమందలి ప్రధాన సంస్కారమును బట్టి అతడి మరుసటి జన్మ యుండును. చిత్తమున ఏర్పడు బలమగు సంస్కారమే కామము. దానివలననే లోకములందలి జీవులందరును నడిపింప బడుచున్నారు. దైవకామ మేర్పడుట, ధర్మకామ మేర్పడుట వలన దైవమును చేరుట ఎట్లో, అట్లే ఇతర కామములు జీవులను ఆయా గతులలో నడిపించుచున్నవి. సాధకులు తమ చిత్త మందలి సంస్కారములను పరిశీలించుకొని, అను నిత్యము ఉత్తమ సంస్కారములకై కృషి సలుపవలెను. ఉత్తమోత్తమ సంస్కారము, ఉత్తమోత్తమ లోకములకు చేర్చగలదు. 🍀*
యం యం వాపి స్మరన్ భావం త్యజ త్యంతే కలేబరమ్ |
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః || 6
తాత్పర్యము :
దేహము త్యజించు సమయమున ఎవరెవరు ఏయే భావములను స్మరింతురో అట్టి భావముల లోనికే చను చుందురు.
వివరణము :
మానవుడు నిరంతరము దేని గురించి చింతించు చుండునో అదియే చిత్తమున సంస్కారముగ నేర్పడి, తదనుగుణమైన లోకములను చేరును. సంస్కారమే జీవుని నడిపించును. కనుక చిత్తమందలి ప్రధాన సంస్కారమును బట్టి అతడి మరుసటి జన్మ యుండును.
తన భావము ననుసరించియే తాను మార్పు చెందుచు నుండును. భావము దైవమును గూర్చి ప్రధానముగ నున్నచో తదనుగుణమగు సంస్కారములు చేరును. ధనమును గూర్చి యైనచో తదనుగుణమగు ప్రదేశములు చేరును. ధనకాంక్ష, కీర్తి కాంక్ష, స్త్రీ కాంక్ష ఆయా లోకములకు గొనిపోవును. దైవీకాంక్ష దైవము దరిచేర్చును. మానవుడు తన భావమును బట్టియే భవిష్యత్ మార్గమును నిర్ణయించుకొను చున్నాడు.
నేడు నిద్ర కుపక్రమించునపుడు రేపటి కార్యములను గూర్చిన భావములే మరునా డుదయము భాసించి, ఆయా కార్యముల లోనికి గొనిపోవును. “రేపు ఉదయముననే పొలమునకు పోవలెను" అని భావించుచో మరునాడు నిదుర లేవగనే ఆ భావము భాసించి పొలమునకు పోవుట జరుగును. చిత్త మందలి బలమగు సంస్కారములే తదనుగుణమగు భావములను సృజింప జేసి ఆ యా మార్గములలో నడిపించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 416🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 24
*🌻. దేవతలు శివునితో మొరపెట్టుకొనుట - 1 🌻*
దేవతలిట్లు పలికిరి-
ప్రకాశస్వరూపుడు, మన్మథుని దహించినవాడు, స్తుతింపదగిన వాడు, గొప్ప తేజశ్శాలి, ముక్కంటి అగు రుద్రునకు అనేక నమస్కారములు (1). రశ్ములచే సర్వమును ప్రకాశింపజేయు ఆదిత్యుడు నీవే. భయంకరాకారుడు, భయమును గొల్పు కన్నులు గలవాడు, ప్రభుడు, మహాదేవుడు అగు నీకు నమస్కారము. నీవు ఇంద్రరూపుడవై స్వర్గమును పాలించుచున్నావు (2). లోకములన్నింటికీ నాథుడు, తండ్రి, తల్లి మరియు పాలకుడు నీవే. నీవు మంగళ స్వరూపుడవు, ఈశ్వరుడవు, మంగళముల నిచ్చువాడవు. నీయందు దయ విశేషముగా గలదు (3). హే ప్రభో! లోకములనన్నింటినీ పోషించునీవు మమ్ములను రక్షింప తగుదువు. మహేశ్వరా! దుఃఖమును పొగొట్టుటలో సమర్థుడు నీవు తక్క మరి ఎవ్వరు గలరు? (4)
బ్రహ్మ ఇట్లు పలికెను-
నందికేశ్వరుడు ఆ దేవతల ఈ మాటలను విని గొప్ప దయగలవాడై శంభునితో విన్నపమును చేయుటకారంభించెను (5).
నందికేశ్వరుడిట్లినెను-
విష్ణువు ప్రముఖముగా గల దేవగణములు, మునిగణములు, సిద్ధగణములు నిన్ను చూచుటకై వేచియున్నారు. ఓ దేవోత్తమా! గొప్ప రాక్షసులచే పీడింపబడి, తీవ్రమగు పరాభవమునకు గురియైన వీరలు నీ అనుగ్రహముచే కార్యసిద్ధిని గోరుచున్నారు (6). హే సర్వేశ్వరా! కావున నీవు మనునులను, దేవతలను రక్షించవలెను. నీవు విశేషించి దీనులకు బంధుడవని, భక్తవత్సలుడవని ఖ్యాతిని గాంచినావు (7).
బ్రహ్మ ఇట్లు పలికెను-
దయాళువు అగు నంది ఇట్లు పరిపరివిధముల విన్నవించగా, శంభుడు మెల్లమెల్లగా ధ్యానమునుండి విరమించి కన్నులను తెరచెను (8). అపుడు ఈశ్వరుడు, పరమజ్ఞాని, పరమాత్మయగు ఈ శంభుడు సమాధిని ఉపసంహరించి, దేవతలందరితో నిట్లనెను (9).
శంభుడిట్లు పలికెను-
ఓ దేవతా శ్రేష్ఠులారా! బ్రహ్మ విష్ణువులను ముందిడు కొని మీరందరు నావద్దకు వచ్చుటకు గల కారణము వెంటనే చెప్పుడు (10).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 163 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 Therefore I say, Peace be with you, “My peace I give unto you,” can only be said by the Master to the beloved disciples who are as Himself - 2 🌻*
582. There are some even among those who are ignorant of the Eastern Wisdom, to whom this can be said, and to whom it can daily be said with more completeness.
583. This is a very interesting and remarkable message, which may well seem strange to us, because there are a great many of us who do know something of the Eastern Wisdom, who pay reverence to the great Masters, who have for many years belonged to an organization specially devoted to Them and Their service, and yet to most of us the Master cannot say, “My Peace I give unto you,” but only to those very few whom He has taken into a much closer relation to Himself. That being so, we yet read that to some who do not know the Eastern Wisdom at all this inner blessing can be given.
584. How is that, and who would they be to whom such a privilege is given? They would be few only, at the present stage of evolution, but still a few there undoubtedly are. In order to understand that, let us think what it is that enables a Master to take a pupil as close to Him as that.
It is that the pupil has come into the Master’s world, has learnt to look at things as the Master looks at them, and to put himself into the Master’s attitude towards the world and all that belongs to it. A man may do that without knowing anything about the Eastern Wisdom or about the Master at all; he may yet without that knowledge be such a man as would take that high view.
The special characteristic of the Master’s attitude is that it is utterly unselfish, that the lower self does not come into it at all. He looks at everything from the standpoint of the plan of the Deity, and He never for one moment brings His own personality into the matter; if anything is helpful for human evolution it is good; if it is a hindrance to human evolution it is an evil thing.
Although the Eastern Wisdom must bring us perfectly into that attitude if we understand it quite fully, yet we can see that others ignorant of it might also reach such an attitude. To be near enough to the Master to receive His peace, utter unselfishness is the first and greatest prerequisite. One may be near the Master, one may receive His peace even, and yet of two who stand beside Him and receive it, one may receive it far more fully than the other.
The ignorant though utterly saintly and unselfish person will receive from the peace of the Master all he can receive, but the man who, equal to him in this respect, possesses in addition the higher wisdom, will receive from that peace infinitely more.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#LightonPath #Theosophy
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 44 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : పద్మావతి దేవి
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. స్మరణ సాన్నిధ్యము. 🌻*
గోపికలనగా నారదుడు భక్తిసూత్రములలో నిర్వచించిన ప్రకారము కృష్ణునకు ఆత్మసమర్పణ చేసి వాని స్మరణలో పులకరింతలు, ఆనందాశ్రువులు పొందగలరు. వీరు కోరునది కృష్ణుని భౌతికమైన సామీప్యము కాక స్మరణ వలన కలిగిన సాన్నిధ్యము.
గోకులమున స్త్రీలు కృష్ణుని యెడల పొందిన అనుభూతి ఇట్టిదే.
గోకులమున కృష్ణుడు వసించినది పన్నెండు సంవత్సరముల వయస్సు లోపున. ఆ స్థితిలో గోపికలు దేనిని పొందిరో దానిని ద్వారకలో కృష్ణుని భార్యలు పొందలేకపోయిరి. వారు పొందినది మమకారపు వలలు.
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 33 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 REMAIN IGNORANT 🍀*
*🕉 Don't have any attitude about fear; in fact, don't call it fear. The moment you have called it fear, you have taken an attitude about it. 🕉*
This is one of the most essential things to stop giving things names. Just watch the feeling, the way it is. Allow it, and don't give it a label--remain ignorant. Ignorance is a tremendously meditative state. Insist on being ignorant, and don't allow the mind to manipulate.
Don't allow the mind to use language and words, labels and categories, because this starts a whole process. One thing is associated with another, and it goes on and on. Simply look--don't call it fear. Become afraid and tremble, that is beautiful. Hide in a corner, get under a blanket. Do what an animal does when it is afraid.
If you allow fear to take possession of you, your hair will stand on end! Then for the first time you will know what a beautiful phenomenon fear is. In that turmoil, in that cyclone, you will come to know that there is still a point somewhere within you that is absolutely untouched.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 93 / Sri Lalita Sahasranamavali - Meaning - 93 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 93. కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।*
*కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93 ॥ 🍀*
🍀 436. కుశలా -
క్షేమము, కౌశల్యమును గలది.
🍀 437. కోమలాకారా -
సుకుమారమైన లేదా మృదులమైన స్వరూపము గలది.
🍀 438. కురుకుల్లా -
🍀 439. కులేశ్వరీ -
కులమార్గమునకు ఈశ్వరి.
🍀 440. కులకుండలయా - కులకుండమును నిలయముగా గలది.
🍀 441. కులమార్గతత్పరసేవితా -
కౌలమార్గమును అనుసరించువారిచే సేవింపబడునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 93 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 93. kuśalā komalākārā kurukullā kuleśvarī |*
*kulakuṇḍālayā kaula-mārga-tatpara-sevitā || 93 || 🌻*
🌻 436 ) Kusala -
She who is intelligent
🌻 437 ) Komalakara -
She who has soft beautiful form
🌻 438 ) Kuru kulla -
She who is of the form of Kuru kulla devi who lives in Vimarsa
🌻 439 ) Kuleshwari -
She who is the goddess for the clan
🌻 440 ) Kula kundalaya -
She who lives in kula kunda or She who is the power called Kundalani
🌻 441 ) Kaula marga that para sevitha -
She who is being worshipped by people who follow Kaula matha
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 93 / Sri Vishnu Sahasra Namavali - 93 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*
*శతభిషం నక్షత్ర ప్రధమ పాద శ్లోకం*
*🍀 93. సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్యధర్మపరాయణః |*
*అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః ‖ 93 ‖ 🍀*
🍀 867) సత్త్వావాన్ -
సత్త్వము గలవాడు.
🍀 868) సాత్త్విక: -
సత్త్వగుణ ప్రధానుడైనవాడు.
🍀 869) సత్య: -
సత్పురుషుల విషయములో మంచిగా ప్రవర్తించువాడు.
🍀 870) సత్యధర్మ పరాయణ: -
సత్య విషయమునందును, ధర్మ విషయమునందును దీక్షాపరుడైనవాడు.
🍀 871) అభిప్రాయ: -
అభిలషించు వారిచేత అభిప్రాయపడువాడు.
🍀 872) ప్రియార్హ: -
భక్తుల ప్రేమకు పాత్రుడైనవాడు.
🍀 873) అర్హ: -
అర్పింపబడుటకు అర్హుడైనవాడు.
🍀 874) ప్రియకృత్ -
తన నాశ్రయించినవారికి ప్రియము నొసగూర్చువాడు.
🍀 875) ప్రీతివర్ధన: -
భక్తులలో భవవంతునిపై ప్రీతిని వృద్ధి చేయువాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 93 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*
*Sloka for Sathabisham 1st Padam*
*🌻 93. sattvavān sāttvikaḥ satyaḥ satyadharmaparāyaṇaḥ |*
*abhiprāyaḥ priyārhōrhaḥ priyakṛt pritivardhanaḥ || 93 || 🌻*
🌻 867. Satvavān:
One who has got the strengthening qualities like heroism, prowess, etc.
🌻 868. Sāttvikaḥ:
One who is established essentially in the Satva Guna.
🌻 869. Satyaḥ:
One who is truly established in good people.
🌻 870. Satya-dharma-parāyaṇaḥ:
One who is present in truthfulness and righteousness in its many aspects.
🌻 871. Abhiprāyaḥ:
The One who is sought after by those who seek the ultimate values of life (Purushartha).
🌻 872. Priyārhaḥ:
The being to whom the objects that are dear to oneself, are fit to be offered.
🌻 873. Arhaḥ:
One who deserves to be worshipped with all the ingredients and rites of worship like offerings, praise, prostration, etc.
🌻 874. Priyakṛt:
One who is not only to be loved but who does what is good and dear to those who worship Him.
🌻 875. Pritivardhanaḥ:
One who enhances the joys of devotees.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment