దేవాపి మహర్షి బోధనలు - 2


🌹. దేవాపి మహర్షి బోధనలు - 2 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 1. కర్తవ్యము - 2 🌻


ఒకనాడొక శిష్యుడు దేవాది మహర్షిని సమీపించి తాను చాలా సాధన చేయుచుంటిననియు అనగా ప్రతిదినము ఉదయము, సాయంత్రము ధ్యానము చేయుచుంటిననియు, ఒక గంట సమయము సేవకు వినియోగించు చుంటిననియు, అయినప్పటికి తనయందు వికాసము తగురీతిన కలుగుట లేదనియు వాపోయెను.

దేవాది మహర్షి మందస్మితము చేసి, ఇట్లు పలికిరి : 'రెండు గంటలు నీ వొనర్చు సాధనను ఇరువది రెండుగంటలలో తుడిచి వేయుచున్నావు కదా! వికాసము ఎట్లు కలుగ గలదు? జీవితమున ఏ సన్నివేశము నందైనను, దివ్య సాన్నిధ్యము లభించుచునే యుండును.

దానిని నిరంతరము గుర్తించుచుండుట నిజమైన సాధన. నీవు దైవమును గుర్తించు కాలముకన్న గుర్తింపని కాలము మిక్కుటముగ నున్నది.

గుర్తించు కాలము గుర్తింపని కాలము కన్న మిన్నగా నున్న సందర్భమున నీవు కోరిన వికాసమునకు అవకాశము కలుగును. నీవు నీ అనారోగ్యమను భావము నందు ఎక్కువగ జీవించు చున్నావు.

శరీరమున నున్న అనారోగ్యమున కన్న భావన యందు దానిని గూర్చిన విచికిత్స ఎక్కువగ నున్నది. ఆరోగ్యము కొరకు చేయవలసిన కర్తవ్యము నందు సోమరితన మెక్కువై అనారోగ్యమును గూర్చిన చింతన పెంచుకొనుచున్నావు.

ఈ విధమైన భావనా మార్గమున నీ అనారోగ్యమునకు పరిష్కారము లేదు. సోమరితనమును వదులుము. చేయవలసినది చేయుము. ఊహలను వదిలి కర్తవ్యము నందు నిలుపుము” అని నిర్దేశించిరి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


14 Jan 2021

No comments:

Post a Comment