భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 135




🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 135   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నారద మహర్షి - 9 🌻

69. అప్పుడు బ్రహ్మ కొంచెం కోపాడ్డాడు,”నేను నిన్ను సృష్టించాను. నీకు ఆజ్ఞ ఇస్తే నన్ను కాదంటావా? వీళ్ళందరూ మౌనంగా ఉన్నారు. నిన్ను శిక్షించగలను జాగ్రత్త!” అన్నాడు. “తండ్రీ! సారహీనమైన, ఘోరమైన దుఃఖం పాలుజేసే సంసారంలో నన్ను పడేస్తానన్నావు కదా! నీ ఆజ్ఞాపాలన అంటే అదే కదా! అలాచేయకపోతే శిక్షిస్తావు.

70. అంతకన్నా శిక్ష ఇంకా ఏముంటుంది? కబట్టినువ్వు ఇంతకంటే ఇంక ఏం శిక్షించగలవో చూస్స్తాను నేను!” అన్నాడు నారదుడు. “కాబట్టి శాపగ్రస్తుణ్ణి చేసినా, నువ్వు ఏం చేసినా సంతోషమే, చెయ్యి!” అన్నాడు. బ్రహ్మకు కోపం వచ్చింది. “నువ్వు విధేయుడివిగా ఉన్నావు. నేను ఒప్పుకోను.

71. పోనీ నిన్ను సనకసనందాదులవలే వదిలేస్తే, నా కార్యమెలా నెరవేరుతుంది? ఇప్పుడు నీలో ఉండేటటువంటి వైరాగ్యప్రవృత్తిని నేను హరిస్తాను. నీలో అవిద్యను ప్రవేశపెడతాను. అది నా చేతిలో ఉంది” అని అతడిలో అవిద్యను ప్రవేశపెట్టి, “సంగీతం ఒకటి తీసుకున్నావుకదా! ఈ సంగీతవిద్యను గంధర్వులుకూడా భవిష్యత్తులో వాళ్ళవృత్తిగా తీసుకుంటారు. సంగీతము, నాట్యము మొదలైన గంధర్వ విద్యలు.

72. గంధర్వ లోకంలో వాళ్ళకు అదే వృత్తి, ప్రవృత్తి. వాటినే ఆశ్రయించుకుని ఈశ్వరారాధన చేస్తారు. సుఖంగా ఉంటారు. ఈశ్వరారాధన చేసినా వాళ్ళకు భక్తి, జ్ఞానము, అంతర్ముఖత్వము ఉండదు. సంగీతం ద్వారానే ఈశ్వరుడిని ఆరాధిస్తారు. వారివలనే నీ తత్త్వజ్ఞానాన్ని విస్మరించి నువ్వుకూడా గంధర్వుడివై, స్త్రీలోలుడివై అప్పుడు నా సంకల్పం నెరవేరుస్తావు” అన్నాడు.

73. అప్పుడు నారదుడు ఆయనతో, “నువ్వు విష్ణువు జగత్పూజ్యుడని ఇంతకుముందే చెప్పావు తండ్రీ! ఆయన పరమ జ్ఞానస్వరూపుడని, ఆయనను ఆశ్రయిస్తే జ్ఞానం కలుగుతుందని చెప్పావు. ఆ కారణం చేత ఆయన పూజ్యుడన్నావు. నువ్వు అడిగినది నేను వద్దంటే, నాకు అజ్ఞానాన్నిచ్చి నన్ను శాపగ్రస్తుడిని చేసావు. జ్ఞానాన్నిచ్చే విష్ణువు పూజ్యుడయితే, నీవు జగత్పూజ్యుడివి కాదన్నమాటే కాదన్నమాటే కదా!

74. నీకు భూలోకం లో గాని, మరెక్కడా గాని పూజ ఉండదు. కాబట్టే నేనిలా అంటున్నాను నిన్ను. ఇప్పుడు నీ ముఖతః ఇవ్వబడింది కనుక, అష్టాక్షరీ మహామంత్రోపదేశం అప్రతిహతమైన శక్తి కలిగినది. నేను ఏ గంధర్వ జన్మ ఎత్తినా, స్త్రీ జన్మ ఎత్తినా, పశుజన్మ ఎత్తినా ఆ హరిభక్తి, అష్టాక్షరీ నన్ను విడవకుండుగాక!” అని శాసనం చేసుకున్నాడు. తండ్రి సమక్షంలో శాసనాన్ని చేసుకున్నాడు.

75. అట్టి మహత్తర శక్తి సంపన్నుడు నారదుడు. అతడి సంకల్పం అవక్రంగా ఉంది. సంసారం ఒక విషవృక్షం అని చెపుతూ, అందులో రెండు స్వాధుఫాలాలు అని చెపుతారు పెద్దలు. ఈ విషవృక్షానికి మధురఫలాలు ఎలా కాస్తాయి అంటే, ఆ మధురఫలాలు లేకపోతే ఆ విషవృక్షాన్ని అందరూ ఛేదించి వెళ్ళిపోతారు. దాంట్లో కూడా ఒకటో రెండో రుచికరమైన ఫలాలు దొరుకుతాయి కాబ్ట్టే దాన్ని ఆశ్రయించి, అది ఎంత విషవృక్షమైనా దానిని వదలరు. ఆ స్వాధుఫలాలు రెండూ అనుకూలమైన దాంపత్యం (అనుకూలమైన భార్య), పుత్రసర్శనం అనేవి. వాటికోసం ఆశిస్తారు. సంసారంలో ప్రవేశిస్తారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 
https://t.me/ChaitanyaVijnanam


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద


13 Oct 2020

No comments:

Post a Comment