✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -05 🌻
ఈ సన్యాసనామం ఇచ్చేటప్పుడు ముఖ్యంగా సన్యాసమంటేనే ఈ ‘ఆంతరిక యజ్ఞం’. ఆంతరిక యజ్ఞాన్ని నిరంతరాయంగా చేస్తారో, వారు అత్యాశ్రమి. వారు నాలుగు ఆశ్రమధర్మాలను దాటినటువంటి వారౌతారు.
ఈ నాలుగు ఆశ్రమధర్మాలను దాటినటువంటి అత్యాశ్రమి ఈ ఆంతరిక యజ్ఞంలో సమర్థుడై, ఆత్మానుభూతిని పొంది, ఆనందస్థితుడవ్వగానే, శోకరహితుడవ్వగానే అతనికి ఆ పేరు ఇవ్వబడుతుంది. అప్పటి వరకూ చైతన్య అనే పేరుతో వుంటాడు. అంటే ఉద్ధవ చైతన్య, ఉద్ధవ చైతన్యానంద, సర్వేశానంద గా మారిపోయాడు ఆయన. అట్లాగే సుందర రాజన్, సుందర చైతన్య, సుందర చైతన్యానంద అయ్యాడు.
ఈ రకంగా ఈ ఆనంద నామము సన్యాసనామము ఎప్పుడు జోడించబడుతుంది అంటే, ఎప్పుడైతే ఈ ఆంతరిక యజ్ఞం ద్వారా ఫలాపేక్ష రహితంగా, ఫలత్యాగ పద్ధతిగా, నిష్కామకర్మగా, ఈ హృదయాకాశము నందు, బుద్ధి గుహ యందు ఉన్నటువంటి ఆత్మానుభూతిని, తాను తెలుసుకొన్నటువంటివాడై, నామరూపాత్మకమైనటువంటి నేనును పోగొట్టుకున్నటువంటి ఆత్మనిష్ఠుడై, ఆనంద స్థితుడై, శోక రహితుడై ఉన్నాడో, అప్పడు ఈ ఆనంద నామం స్థిరమైపోతుంది.
అటువంటి స్థితిని మానవుడు తప్పక పొందాలి. ఈ ఆనందము పేరు ఆత్మానందము. ఆత్మానందమును అనుభవించును. వీడికి ఇంకే పని ఉండదు. వీడి జన్మ మొత్తం మీద వీడికేమైనా పనులున్నాయా అంటే ఇక ఒక్కటే ఒక కర్తవ్యం మిగులుతుంది. ఏమిటంటే, సదా ఆత్మానందుడై వుండుట. ఉండుట. చేయుట లేదు
ఇక వీడికి. కర్మ యొక్క ప్రభావం లేదు. కాబట్టి చేయడం అనే ప్రసక్తే లేదు. కాబట్టి ఏమిటి అంటే ఆత్మానందము నందు వుండుట అనేది ప్రారంభమైనది. ఇక నుంచి వీడు చేసే అన్ని కర్మలు, సర్వ కర్మలు కూడా ఈ ఆంతరిక యజ్ఞంలో దగ్ధం అయిపోతాయి.
‘మాం ఏకం శరణం వ్రజా’- పరమాత్మకు సర్వస్య శరణాగతి అయిపోయాడు కాబట్టి, ఇంక వేరే అన్యము లేదు కాబట్టి, అంతటా తానే ఉన్నాడు కాబట్టి, అన్యమును తెలుసుకొనగోరు ఇచ్ఛ లేదు కాబట్టి, అన్యము లేదు కాబట్టి, అనేకత్వము లేదు కాబట్టి, సహస్రదా సర్వదా సర్వకాలము నందు ఉన్న ఏక తత్వమైనటువంటి ఆత్మ తత్వమునందే రమించుచున్నాడు కాబట్టి. ఈ రకంగా ఆత్మానందమును అనుభవించుచున్నాడు. ఇట్టి స్థితిని మానవుడు తప్పక సాధించాలి.
ఆత్మ సర్వవ్యాపకమగుటచేత ఆత్మలేని తావులేదు. పరిచ్ఛిన్నత్వమున్న వాటికే గదా కదలుటకవకాశమున్నది. అపరిచ్చిన్నుడు, అచలుడు అయిన ఆత్మ దూరము పోవునట్లగపడుచున్నాడు.
ఆనందము మరియు ఆనంద రహితమునై యున్న ఈ ఆత్మను నాకంటే వేరైనవాడెవడు తెలిసికొనగలడు. అంతర్ముఖులు, ఇంద్రియ నిగ్రహపరులైన జ్ఞానులు దప్ప విషయాదులతో కూడి యుండు సామాన్యులు ఆత్మను తెలియలేదు.
ఇక్కడేమి చెపుతున్నారు? ఆ ఆత్మానందం యొక్క విశేషాన్ని తెలియచెప్పి నీ ఆత్మ యొక్క మరిన్ని లక్షణాలను తెలియజేస్తున్నారు. ఆత్మ లేని తావు లేదు. మైక్రోమిల్లీ మీటర్‌లో ఉన్నటువంటి, ఆర్ ఎన్ ఏ [R.N.A], డీ ఎన్ ఏ [D.N.A] దగ్గర నుంచి మొదలుపెడితే పరమాణవైనటువంటి ఎలిమెంట్స్ [elements], బేసిక్ ఎలిమెంట్స్ [Basic elements] ఏవైతే ఉన్నాయో, ఈ సృష్టియందు హీలియం అనుకో, ఉదజని అనుకో, ఆక్సిజన్ అనుకో, హైడ్రోజన్ అనుకో ఏ పేర్లైనా పెట్టుకో,
అత్యంత చిన్నదైనటువంటి పరమాణువు, ఆటమ్ [atom] దగ్గర నుంచీ మొదలుపెడితే, అనంతముగా వ్యాపించి వున్నటువంటి విశ్వము వరకూ, బ్రహ్మము వరకూ సర్వత్రా ఉన్నది ఏదైతే ఉన్నదో, ఉండుట మాత్రమే లక్షణముగా కలది ఏదైతే ఉన్నదో, అది ఆత్మ.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ
13 Oct 2020
No comments:
Post a Comment