శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 275 / Sri Lalitha Chaitanya Vijnanam - 275


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 275 / Sri Lalitha Chaitanya Vijnanam - 275 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 65. భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ ।
పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ ॥ 65 ॥ 🍀

🌻 275. 'భానుమండల మధ్యస్థా' 🌻

సవితృ మండల మధ్యమున స్థిరముగొన్నది శ్రీమాత అని అర్థము.

సూర్యున కాధారము సవిత. పండ్రెండు సూర్యమండలములకిది. కేంద్రము. సూర్యుడు ఒక సౌర మండలమునకు కేంద్రము కాగా, అట్టి సూర్యులు పండ్రెండు మందికి కేంద్రముగ సవిత అను దేవత యున్నది. అట్టి సవితృ మండలమునకు కేంద్రముగ భర్గోదేవుడున్నాడు. భర్గోదేవు డనగా ప్రచండమై, సృష్టి కాధారమై, పరము నుండి పుట్టిన వెలుగు. ఈ వెలుగే శ్రీమాత.

భాను అను పదమునకు మూలార్థము వెలుగుగ ప్రకటింప బడినది అని అర్థము. చీకటినుండి ప్రప్రథమముగ వెలువడిన వెలుగే శ్రీమాత. ఆ వెలుగు ఆధారముగనే భర్గోదేవ మండలము, సవితృ మండలము, సూర్యమండలము ఒక దాని నుండి ఒకటి ఏర్పడు చున్నవి. నాలుగు స్థితులలో వెలుగు అవతరించు చున్నది. ఈ వెలుగును దర్శించుటకే గాయత్రి ఉపాసనము. శ్రీదేవి సృష్టి కేంద్రము. ఆమె ఆధారముగనే భర్గోదేవుడు జన్మించును. ఆదిత్య మండల మేర్పడును.

ఆదిత్య మండలము నుండి సవితృ మండలము, సవితృ మండలము నుండి సూర్యమండలములు గుంపులు గుంపులుగ పుట్టుకొని వచ్చును. ఇట్లవరోహణ క్రమమున అంతయూ ఏర్పడుచుండగ అన్నిటియందు కేంద్రముగ శ్రీదేవి అవతరించు చుండును. ఇది ఆమె సదాశివ తత్త్వమని, వాసుదేవ తత్త్వమని తెలుపబడినది. అన్నిటియందు అంతర్యామిగ ఈ తత్త్వమే యుండును. అణువు నందు అణుకేంద్రముగను, బ్రహ్మాండము నందు బిందువుగను తానుండి సృష్టి స్థితి లయములను కలిగించుచుండును.

ఆదిత్య హృదయము అనగా కూడా నిదియే. అగస్త్య మహర్షి శ్రీరాముని కందించిన అంతర్యామి ఉపదేశమిది. నారదుడు ధృవునకు, వ్యాసునకు, ప్రహ్లాదునకు బోధించిన వాసుదేవ తత్వమిదియే. రాముని సర్వాంతర్యామిగ వాల్మీకి కూడా నిదియే బోధించినాడు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు అర్జునునికి "వాసుదేవ మితి సర్వం” అని బోధించినాడు. ఇట్లు ప్రకాశించు ప్రతి అణువు మధ్యమున, బ్రహ్మాండ మధ్యమున స్థితిగొన్నది శ్రీమాత.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 275 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🍀 65. bhānumaṇḍala-madhyasthā bhairavī bhagamālinī |
padmāsanā bhagavatī padmanābha-sahodarī || 65 || 🍀

🌻 Bhānu-maṇḍala-madhyastā भानु-मण्डल-मध्यस्ता (275) 🌻

She is in the middle of solar orbit. Chāndogya Upaniṣad (I.vi.6) says, “There is deity within the orbit of the sun, who is seen by yogis. His whole body glitters like gold.” ‘Obeisance to that form in the sun’s orbit the one, who is the embodiment of all the Veda-s, who showers his brilliance all over the different worlds (These worlds are the seven vyāhṛti-s of pūrṇa Gāyatrī mantra. Worlds refer to seven worlds above and seven worlds beneath totalling to fourteen. These imaginary worlds are the modifications of one’s consciousness. The worlds could also refer to three types of mundane consciousness, awake, dream and deep sleep).

Anāhat cakra is also called bhānu-maṇḍala and kuṇḍalinī also glitters like gold. Possibly, this nāma could mean Her kuṇḍalinī form.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


11 Jun 2021

No comments:

Post a Comment