దేవాపి మహర్షి బోధనలు - 97


🌹. దేవాపి మహర్షి బోధనలు - 97 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 78. మధుర మార్గము -1 🌻


కన్నులకు కనపడనివి చూచుటకు, చెవులకు వినపడనివి వినుటకు ప్రయత్నము చేయుడు. దివ్యలోకమందలి మూర్తులను చూచుచున్నట్లు, వారి భాషణము వినుచున్నట్లు భావన చేయుడు. ఇది యొక ప్రయోగము. ఇట్లు చేసినచో పరిసరములందలి రూపములు, భాషణములు, మీకిక వినపడవు. చప్పుడులు మీకంతరాయమును కలిగించవు. క్రమముగ మీ యందు దూరదృష్టి, దూర శ్రవణము ఏర్పడును. మీ సద్గురువును కూడ మీరిట్లే నిజముగ దర్శించవచ్చు. ఇది నిజమైన “పరధ్యానము.”

ఇహమును మరచు స్థితి. కాల కృత్యములు, కర్తవ్యములు, నిత్య నైమిత్తిక కర్మలు యొనర్చిన పిమ్మట ఈ పరధ్యానమున నిమగ్నమగుడు. దీని వలన మీరు పొందు అనుభూతి కారణముగ మీ శరీర ధాతువులలో కోరదగిన మార్పు వచ్చును. ఇహలోక విషయము లంతగ బాధింపక పట్టు సడలును.

మీరాబాయి కృష్ణునిట్లే ఆరాధించినది. భక్తులందరు ఊహాజనిత మార్గముననే తీర్చిదిద్దబడినారు. ఇది యొక మధురమైన మార్గము. దీనిలో తన్మయత్వముండును. మధురాష్టకము దీనినే సూచించు చున్నది. గాయకులు, కవులు ఈ మార్గమున తరించినారు. అపురూప మగు దివ్య దర్శనములు అందిన ఫలముగ ఈ మార్గ మొసంగును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


11 Jun 2021

No comments:

Post a Comment