మైత్రేయ మహర్షి బోధనలు - 1
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 1 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 1. గురుపరంపర-1 🌻
మానవజాతి చరిత్రలో సత్యమును గూర్చి సిద్ధాంతములు వెలువడినవి. ఎన్ని సిద్ధాంతములు వ్యక్తమైనచో అన్ని వక్రసిద్ధాంతములు కూడ ఏర్పడినవి. ఎన్నియో సత్యసూత్రములు కూడ నశించినవి. కాని ఎప్పటి కప్పుడు సత్యము తనకు తానుగా హృదయ ద్వారము నుండి నిత్య నూతనముగా వ్యక్తమగుట భగవదనుగ్రహము. హృదయగహ్వరమునకు నడిపించుట గురుపరంపర యొక్క ముఖ్య ప్రయోజనము.
భృక్తమును సంఘసేవ ద్వారా రహితమును కావించుట, క్రమబద్ధమైన సాధన ద్వారా జీవునికి పరిణతి కలిగించుట, సృష్టి యందలి అందమును, వైభవమును రుచి చూపించుట, తత్ మార్గమున తపో దీక్షతో హృదయమున ప్రవేశపెట్టుట వేల సంవత్సరముల నుండి మా గురుపరంపర నిర్వర్తించుచున్న మహాయజ్ఞము.
గురుపరంపర అనంతత్వమునకు నిచ్చెన వలె నిలచిన బృందము. అనంతత్వము వరకు జీవునకు ప్రేరణనిచ్చి తద్వారమున జీవునికి అనుభూతి కలుగు అర్హత కల్పించుట వారి కర్తవ్యము నందొక భాగము. దారి వెదుకుకొను వారికి ధృవతారగా నిలచి వెలుగు మార్గమున ప్రవేశపెట్టి తాము నిష్క్రమింతురు. అనగా తెర వెనుక నుందురు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
06 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment