నిర్మల ధ్యానాలు - ఓషో - 68


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 68 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ఎప్పుడు నువ్వు పరమానందంలో వుంటావో ఆ క్షణం నించీ నువ్వు అనంతంతో సమశృతిలో వున్నావనీ తెలుసుకో. మనం ఎప్పుడూ బాధగా వుంటే తెలిసో తెలియకో అనంతానికి వ్యతిరేకంగా, విశ్వగానానికి వ్యతిరేకంగా మనం వున్నామని గుర్తించాలి. దారి తప్పామని గుర్తించాలి. 🍀


జీవితం ఒక దైవికమయిన కథ. అది నీ జీవిత చరిత్ర. మనం కేవలం అందులోని పేజీలం, పేరాగ్రాపులం. ఫుట్ నోట్‌లం. అస్తిత్వమే మన గొప్ప ఆర్కెస్ట్రా. మనం చిన్ని వాద్యాలం. మనం అనంత గానంతో శృతి కలుపుతాం. అది మనకు పరమానందాన్నిస్తుంది. మనం అనంతానికి వ్యతిరేకంగా పాడితే అది కష్టాల్ని తెస్తుంది. కాబట్టి ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. మనం ఎప్పుడూ బాధగా వుంటే తెలిసో తెలియకో అనంతానికి వ్యతిరేకంగా, విశ్వగానానికి వ్యతిరేకంగా మనం వున్నామని గుర్తించాలి. దారి తప్పామని గుర్తించాలి. సరైన మార్గంలోకి రావాలి. దానికి ఎవర్నీ బాధ్యుల్ని చెయ్యకు. నీకు నిన్నే బాధ్యుణ్ణి చేయి.

ఎప్పుడు నువ్వు పరమానందంలో వుంటావో ఆ క్షణం నించీ నువ్వు అనంతంతో సమశృతిలో వున్నావనీ తెలుసుకో. అదెట్లా జరిగిందో గమనించు. అట్లాంటి అనుబంధాన్ని మళ్ళీ మళ్ళీ ఏర్పరచుకో. గాఢంగా ఏర్పరచుకో.

విషాదం, పరమానందం గొప్ప ఉపాధ్యాయులు. నిశ్శబ్దంగా ఈ యిద్దరు ఉపాధ్యాయుల్ని నువ్వు పరిశీలిస్తే నువ్వు ఎంతో నేర్చుకోవచ్చు. వాళ్ళకు మించిన పవిత్ర గ్రంథాలు లేవు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


06 Sep 2021

No comments:

Post a Comment