🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 53 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. అప్రయత్నము - శ్రమ 🌻
దూది పరుపులు, వెండి, బంగారు కంచములు, పట్టు వస్త్రములు, మేడలు, మిద్దెలు మున్నగునవి అప్రయత్నముగా లభించినపుడు అనుభవింప వచ్చును. కాని వానిని సాధించుకొనుటకై శ్రమపడుట అవివేకము.
సుఖమునకై శ్రమపడుట తెలివి తక్కువయే కాని సుఖము కాదు. మరియు శరీరమునకు సుఖము నలవాటు చేసినచో ఎపుడయిన పరుపులు మొదలగునవి లభింపనపుడు మనసు ఏడ్చును. అట్టిది కలుగకుండ తెలివిగా మెలగినచో అనుభవింపవచ్చును.
భాగవతము 2-21 వివరణము
🌹 🌹 🌹 🌹 🌹
11 Jul 2021
No comments:
Post a Comment