నిర్మల ధ్యానాలు - ఓషో - 90


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 90 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. జీవితం ఒక తీర్థయాత్ర. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేని తీర్థయాత్ర. ఇది అర్థం చేసుకుంటే గొప్ప స్వేచ్ఛ వస్తుంది. ఎట్లాంటి లక్ష్యము లేనపుడు వైఫల్యమన్నది వుండదు. నువ్వు కేవలం ప్రయాణాన్ని ఆనందిచడం ప్రారంభించు. 🍀


జీవితమంటే ఎప్పుడూ ప్రవహిస్తూ వుండటం. సాగుతూ వుండడం. సుదూర తీరంలోని నక్షత్రం కేసి సాగడం. ప్రయాణాన్ని పరవశించడం. మరీ లక్ష్యాల గురించి అంతగా ఆందోళన పడదు. లక్ష్యాలని మినహాయించు. ప్రయాణించడాన్నే ఆనందించాలి. జీవితం ఒక తీర్థయాత్ర. ఏమీలేని తన కేసి సాగే తీర్థయాత్ర. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేని తీర్థయాత్ర. కేవలం స్వచ్ఛమయిన తీర్థయాత్ర. ఇది అర్థం చేసుకుంటే గొప్ప స్వేచ్ఛ వస్తుంది. గొప్ప వెసులుబాటు కలుగుతుంది. ఆందోళనలు, ఆవేశాలు అదృశ్యమవుతాయి. ఆవిరవుతాయి. అక్కడ ఎట్లాంటి లక్ష్యము లేనపుడు వైఫల్యమన్నది వుండదు. మనం లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాం కాబట్టి వైఫల్యమన్న అభిప్రాయముంటుంది.

వుదాహరణకి నాకెలాంటి లక్ష్యము లేదు కాబట్టి వైఫల్యమంటూ లేదు. నేను ఏదీ ఆశించను కాబట్టి చిరాకు పడే వీలుండదు. ఏదయినా జరిగితే మంచిదే ఏదీ జరక్కున్నా మంచిదే. అది నా ప్రాథమిక బోధన. ప్రతిక్షణాన్ని సంపూర్తిగా జీవించు. అంటే అక్కడేదో అంతముందని కాదు. మొదట్లో కష్టం. అందుకే నేను కృత్రిమ లక్ష్యాల్ని ఏర్పరుస్తాను. అవి బొమ్మల్లాంటివి. నువ్వు ప్రయాణాన్ని ఆనందిచడం ప్రారంభించావా, ఎట్లాంటి లక్ష్యాల పట్లా నీకు పట్టింపు వుండదు. అప్పుడు నువ్వు జీవితానికి సంబంధించిన అర్థం గురించి అడగవు. జీవితానికి దానికి సంబంధించిన అర్థం దానికుంది. దాని ఆరంభం దానికుంది, దాని అంతం దానికుంది. ఇదే సంపూర్ణ స్వేచ్ఛకు సంబంధించిన స్థితి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


06 Nov 2021

No comments:

Post a Comment