శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 318 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 318-1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 318 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 318-1 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀
🌻 318-1. 'రాక్షసఘ్ని' 🌻
రాక్షసులను చంపునది శ్రీమాత అని అర్థము. రాక్షస శక్తులు సృష్టి స్థితులకు వ్యతిరేకముగ ప్రవర్తించు చుండును. చీకటి అను అజ్ఞానమును పెంపొందించు చుండును. సృష్టికి ఆటంకములు కలిగించు చుండును. వృద్ధికి కూడ ఆటంకములు కలిగించును. సృష్టికి పూర్వము నుండి గల చీకటి సృష్టిని అనుమతింపదు. చీకటిగ నున్న చోటులో వెలుగునకు తావివ్వదు. ఇది రాక్షస శక్తి లక్షణము. ఈ శక్తి అధర్మము నాశ్రయించి బలముగ నుండును. సద్భావములు కలుగనివ్వదు. సద్భాషణము కూడ అనుమతింపదు. సత్కార్యములను భగ్నము చేయుచుండును. సృష్టికే వ్యతిరేకముగ నుండును గనుక సృష్టియందు పుట్టిన జీవులను అమితముగ బాధించును.
భగవంతుని అవతారము లన్నియూ రాక్షసులను నిర్జించుటకే ఏర్పడినవి. నారాయణ స్మరణమున నిలచి సృష్టి నిర్మాణమునకై సంకల్పించిన బ్రహ్మదేవుని జ్ఞానము సోమకుడను రాక్షసుని హరించెను. అప్పుడు దైవము మత్స్యావతారము ధరించి చీకటి యను మహాసముద్రమున దాగియున్న రాక్షసుని సంహరించి వేదములను బ్రహ్మ కందించెను. అట్లు సృష్టి ఆరంభము నుండి నేటి వరకు రాక్షస శక్తులు తమవంతు అశాంతిని సృష్టించుచునే యున్నారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 318-1 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya
Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻
🌻 318-1. Rākṣasaghnī राक्षसघ्नी (318)🌻
The destroyer of demons. Kṛṣṇa says (Bhagavad Gīta IV.8) “I appear from age to age to protect the virtuous and to destroy the evil doers in order to re-establish righteousness”. This is the famous saying of Bhagavad Gīta:
paritrāṇāya sādhūnāṁ vināśāya ca duṣkṛtām|
dharmasaṁsthāpanārthāya sambhavāmi yuge yuge||
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे॥
Demons mean the evils. It is believed that when evil prevails everywhere, the great dissolution of the universe takes place and the creation happens again
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
06 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment