భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 79


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 79 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ



🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 01 🌻

సూక్ష్మగోళము:

334. సూక్ష్మ మండలము అనంత ప్రాణ సామ్రాజ్యము. భగవంతుని అనంత స్వభావత్రయములో ఒకటైన అనంత శక్తి, పరిమితమైన మిద్యాజగత్తులోనికి ప్రసరించినప్పుడు, అది సూక్ష్మలోకములో అనంత ప్రాణశక్తిగా రూపాంతర మొందెను.

335. సూక్ష్మలోకము 7 డివిజనులుగా విభజింపబడిఉన్నను అది అంతయూ ఒకటే ప్రపంచము. ఇది ప్రాణశక్తి మయ గోళము. ఈ గోళము మనోమయ గోళము పై ఆధార పడి యున్ననూ, భౌతిక గోళము పట్ల స్వతంత్రమైనది.

336. సూక్ష్మగోళము, దాని ప్రాణశక్తి, అందలి దివ్యజీవులు, మానవుని పూర్తి సూక్ష్మచైతన్యము పాక్షిక సూక్ష్మ చైతన్యముల ద్వారా భౌతిక గోళమును అల్లుకొనుచుప్పుడు,సూర్యులు, నక్షత్రములు, గ్రహములు అన్ని ప్రపంచములో నున్న ప్రతి వస్తువు, ప్రతిజీవి వీటిఅన్నిటితో కూడిన అనంత ఆకాశము కూడా అల్లుకొనుచున్నది. అనంతాకాశము కూడా భౌతిక గోళము లోపల నున్నది.

337.అపరిమితమైన నానాత్వమును సూక్ష్మదృశ్యములు, సూక్ష్మధ్వనులు, సూక్ష్మానుభూతులు శక్తులయొక్క తీవ్రతయును భౌతికగోళములో సమాంతరమును కలిగియుండక ప్రాణశక్తిని కాపాడుచున్నవి.ఈ ప్రాణశక్తి భౌతిక హద్దులలోపల పరిమిత మగుచున్నది. మానవుని చైతన్యము భౌతిక పరిమితులచే చుట్టబడియున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹



Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/



22 Oct 2020

No comments:

Post a Comment