శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 46, 47 / Sri Lalitha Chaitanya Vijnanam - 46, 47

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 27 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 46 / Sri Lalitha Chaitanya Vijnanam - 46 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

20. శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ

మరాళి మందగమనా మహాలావణ్య శేవధి

🌻 46. 'శింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజా' 🌻

ఈ నామమున అమ్మవారి కాలి అందెల వర్ణన మున్నది. శబ్దములు చేయుచున్న, మణిమయ కాంతులచే విరాజిల్లుచున్న అందెలుకల పాదములు గలది శ్రీదేవి అని అర్థము. ఆమె కాలి అందెలు చేయు శబ్దములు వేద నాదములని గ్రహింపవలెను. వాటి మణిమయ కాంతులు చిత్కళ అనుభూతులని తెలియవలెను.

ఉత్తమ ఉపాసకులకు అమ్మవారి ధ్యానమున నాదములు వినిపించుట జరుగుచున్నవి. అవి కింకిణి శబ్దములుగ మొదలై దశ విధములగు నాదములుగ వినిపించుచు అనుశ్యూతము, శ్రావ్యము అగు వేణునాదముగ పరిణమించును.

అట్లే నాద శ్రవణముతోపాటు చిత్కళను గోచరించుచు తేజోమయమైన కాంతుల వరకు దర్శనము జరుగు చుండును. ఉపాసకులకు గృహము నందు గజ్జల మ్రోతలు వినపడుట నుండి వేదనాదము వరకు వినిపించుట జరుగుచుండును.

ఈ నాద ధ్వనులన్నియు అనాహతములే. అట్లే చిత్కళలతో ప్రారంభమై బింబ దర్శనము వరకు దర్శనములు జరుగుచుండును.

పై నాద కళానుభూతులు అమ్మవారి సాన్నిధ్యమును సంకేతించును. పై అనుభూతులు కలవారు దేవీ దర్శనమునకు ప్రాతులగు చున్నారని తెలియవలెను. పరహితము చేయుచు, పవిత్రతను పెంచుకొనుచు వారు శ్రీదేవి పాద దర్శనమునకు చేరువగుచుందురు. ఈ కాలి అందెల తళుకులు, నాదములు తన్మయత్వము కలిగించుచు ఉపాసకుని దివ్యసాన్నిధ్యమున నిలుపును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 46 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Siñjāna- maṇi- mañjīra- maṇḍita-srīpadāmbujā सिञ्जान-मणि-मञ्जीर-मण्डित-स्रीपदाम्बुजा (46)

She is wearing anklets made out of precious gems that shine.

It is to be noted that five nāma-s 42 to 46 describe only about Her feet. When Her feet alone are described in such a detailed manner, it is beyond human comprehension to think about Her powerful form.

This is made so by Vāc Devi-s, to impress about Her prākaśa vimarśa mahā māyā svarūpinī form.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 47 / Sri Lalitha Chaitanya Vijnanam - 47 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

20. శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ

మరాళి మందగమనా మహాలావణ్య శేవధి

🌻 47. 'మరాళీ మందగమనా' 🌻

ఆడుహంస వలె విశేషమైన సౌందర్యముతో కూడిన మెల్లని, ఒయ్యారమైన నడక గలది శ్రీదేవి అని అర్థము. హంస నడకలు వర్ణింపలేని ఒయ్యారము గలవి.

ఆ నడకలు నెమ్మదిగను, సౌందర్యముగను, చూపరులను ఆకర్షించునట్టివిగను, ఆనందదాయకముగను ఉండును. అందున ఆడుహంస మరింత విశేషించి పై లక్షణములను కలిగియుండును. మరాళ మనగా హంస, మరాళి అనగా ఆడుహంస. శ్రీదేవి గమనము ఆడుహంస గమనముతో పోల్చబడినది.

హంస శబ్దమునకు అనేకార్థములు గలవు. హంస అనగా తేజో మూర్తియగు సూర్యుడు. హంస అనగా "నే నతడే” అని యర్థము.

అనగా నేను పరమాత్మ స్వరూపుడను అని యర్థము. శ్రీదేవి తేజోమయ మూర్తి. సృష్టియందలి తేజస్సంతయు ఆమెదే. అగ్ని, సూర్యుడు, చంద్రుల కాంతి ఆమెదే. ఆమె పరమాత్మ యొక్క వ్యక్తరూపమే. పరమాత్మ అగుపించుట యనగా ఆమె యగుపించుటయే.

ఆమె దర్శనము అతడి దర్శనమే. కేనోపనిషత్తు దీని నద్భుతముగ ప్రకటింపజేసినది. మరియు హంస పరమ మంత్రము. అనగా పరమును చేర్చు మంత్రము. ఇహము నుండి తరింపుచేయు మంత్రము. తారకమంత్రము.

అమ్మవారి హంస గమనము మనయందలి ఉచ్ఛ్వాస నిశ్వాసలుగ గమనించవలెను. సూక్ష్మముగ, మందముగ, మంద్రముగ జరుగు సూక్ష్మ స్పందన శ్రీదేవి కదలిక యని తెలియవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 47 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 47. Marālī-manda-gamanā मराली-मन्द-गमना (47) 🌻

Her walking gait is like a female swan. When She comes out of the kunda (nāma 4) and walking towards gods and goddesses, Her gait is described like this.

The fact is that Her gait cannot be compared to that of swans, as Her gait is incomparable. In order to give an idea about Her gait such visual comparisons are made.

Saundarya Laharī (verse 91) says, “Oh! Goddess of graceful gait! Your household swans, as if intent on practising to balance their steps with tripping gait, do not abandon your feet.”

With this nāma the subtle description of Śaktī kūṭa of Pañcadaśī is concluded.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹



Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


22 Oct 2020

No comments:

Post a Comment