📚. ప్రసాద్ భరద్వాజ
🌻 65. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ 🌻
ఓం ప్రాణదాయ నమః | ॐ प्राणदाय नमः | OM Prāṇadāya namaḥ
ప్రాణాన్ దదాతి ప్రాణులు చేష్టించుటకు ఆవస్యకమగు పంచ మహా ప్రాణములు అయిన ప్రాణము, అపానము, వ్యానము, ఉదాన సమానములూ, పంచ ఉపప్రాణములు అయిన నాగము, కూర్మము, కృకరము, దేవదత్త ధనంజయములను జీవులకు ఇచ్చు వాడు.
:: తైత్తీరీయోపనిషత్ - ద్వితీయాధ్యాయః, సప్తమోఽనువాకః ::
అసద్వా ఇదమగ్ర ఆసీత్ । తతో వై స దజాయత తదాత్మానగ్‍ం స్వయ మకురుత । తస్మాత్తత్సుకృత ముచ్యత ఇతి । యద్వై తత్సుకృతమ్ । రసో వై సః । రసగ్‍ం హ్యేవాయం లబ్ధ్వాఽఽనందీ భవతి । కే హ్యేవాఽన్యాత్కః ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో న స్యాత్ । ఏష హ్యేవానందయాతి ॥ 1 ॥
పూర్వమునందు పరబ్రహ్మ స్వరూపముగా చెప్పబడిన ఈ ప్రపంచము సృష్టికి పూర్వము వ్యాకృతమై నామరూప విశేషములకు విపరీతమగు అవ్యాకృతమైన పరబ్రహ్మముగానే యుండెను. అట్టి అవ్యాకృత పరబ్రహ్మము నుండియే ప్రవివిక్తమగు నామరూప విశేషముగల జగత్తు పుట్టెను.
ఏ కారణమువలన ఆ పరబ్రహ్మము ఈ ప్రకారము తన్ను తాను చేసికొనెనో ఆ కారణమునుండియే బ్రహ్మము స్వకర్తృకమైనదని చెప్పబడుచున్నది. ఇట్లు స్వకర్తృకమైన ఆ పరబ్రహ్మము, తృప్తి హేతువగు ఆనందకరమైన రసస్వరూపముగానున్నది.
ఇట్టి రసస్వరూపమును జీవి పొంది సుఖవంతుడగుచున్నాడు. ఈ సుఖస్వరూపమైన పరమాత్మ హృదయాకాశమునందు లేని యెడల ఎవడు ప్రాణాపానాది వ్యాపారము చేయును? ఈ పరమాత్మయే లోకమును సుఖపెట్టుచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 65 🌹
📚. Prasad Bharadwaj
🌻 65.Prāṇadaḥ 🌻
OM Prāṇadāya namaḥ
Prāṇān dadāti One who bestows or activates the five main vital energies of Prāṇa, Apāna, Vyāna, Udāna and Samāna as also the other (sub vital) energies of Nāga, Kūrma, Kr̥kara, Devadatta and Dhananjaya.
Taittīrīyopaniṣat - Chapter 2, Anuvāka 7
Asadvā idamagra āsīt, Tato vai sa dajāyata tadātmānagˈṃ svaya makuruta, Tasmāttatsukr̥ta mucyata iti, Yadvai tatsukr̥tam, Raso vai saḥ, Rasagˈṃ hyevāyaṃ labdhvā’’naṃdī bhavati, Ke hyevā’nyātkaḥ prāṇyāt yadeṣa ākāśa ānaṃdo na syāt, Eṣa hyevānaṃdayāti. (1)
In the beginning was verily this non-existent. From that (Parabrahma) was generated the existent.
That made Itself by Itself. Therefore It is called Self-made. That one who is self-made is verily the joy. Having attained this joy, (man) becomes blessed. Who would have lived and breathed, had not this sky of bliss existed? This verily It is that bestows bliss.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
ईशानः प्राणदः प्राणो ज्येष्ठश्श्रेष्ठः प्रजापतिः ।हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ॥ ८ ॥
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్శ్రేష్ఠః ప్రజాపతిః ।హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ ౮ ॥
Īśānaḥ prāṇadaḥ prāṇo jyeṣṭhaśśreṣṭhaḥ prajāpatiḥ ।Hiraṇyagarbho bhūgarbho mādhavo madhusūdanaḥ ॥ 8 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 66 / Vishnu Sahasranama Contemplation - 66 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 66. ప్రాణః, प्राणः, Prāṇaḥ 🌻
ఓం ప్రాణాయ నమః | ॐ प्राणाय नमः | OM Prāṇāya namaḥ
ప్రాణితి శ్వాసోచ్ఛ్వాసక్రియలు జరుపునది. క్షేత్రజ్ఞుడుగా జీవరూపమునందుండు విష్ణువు. లేదా జీవుల ప్రాణమునకు శక్తినిచ్చు పరమాత్మ. ముఖ్యప్రాణము అని కూడా అర్థము.
:: బృహదారణ్యకోపనిషత్ - చతుర్థాధ్యాయః - చతుర్థం బ్రాహ్మణం ::
ప్రాణస్య ప్రాణముత చక్షుష శ్చక్షురుత శ్రోత్రస్య శ్రోత్రం । మనసో యే మనోవిదుః । తే నిచిక్యుః బ్రహ్మ పురాణ మగ్ర్యం ॥ 18 ॥
అక్షర రూపమగునది ఏది ప్రాణమునకు ప్రాణమో (ప్రాణ వ్యాపారమునకు ఆధారమో), నేత్రమునకు నేత్రమో, శ్రోత్రమునకు (చెవికి) శ్రోత్రమో, మనస్సునకే మనస్సువంటిదో అద్దానిని తెలిసికొనినవారే పరబ్రహ్మమును నిశ్చయముగా దెలిపికొనువారు.
:: ఛాందోగ్యోపనిషత్ - పంచమః ప్రపాఠకః, ప్రథమ ఖండః ::
నవై వాచో నచక్షూంషి నశ్రోత్రాణి నమనాంసీత్యాచక్షతే ప్రాణా ఇత్యేవాచక్షతే ప్రాణో హ్యే వైతాని సర్వాణి భవతి ॥ 15 ॥
వాగింద్రియము, నేత్రేంద్రియము, శ్రోత్రేంద్రియము, మనస్సు - ఇవన్నియు ప్రత్యేకముగా చైతన్యము కలిగి యుండవు. వీటన్నింటిని ప్రాణములని ప్రజలు పిలిచెదరు. ఈ ఇంద్రియములన్నియు ప్రాణమే గానీ, వేరు కాదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 66🌹
📚. Prasad Bharadwaj
🌻 66. Prāṇaḥ 🌻
OM Prāṇāya namaḥ
Prāṇiti Breathes. The name may refer to Kṣetrajña, the Jīva or the Paramātma. It may also mean Mukhyaprāṇa, the life principle.
Br̥hadāraṇyakopaniṣat - Section 4, Brāhmaṇa 4
Prāṇasya prāṇamuta cakṣuṣa ścakṣuruta śrotrasya śrotraṃ, manaso ye manoviduḥ, Te nicikyuḥ brahma purāṇa magryaṃ. (18)
Those who have known the Vital Force of the vital force, the Eye of the eye, the Ear of the ear and the Mind of the mind, have realized the ancient, primodial Brahman.
Chāndogyopaniṣat - 5.1
Navai vāco nacakṣūṃṣi naśrotrāṇi namanāṃsītyācakṣate prāṇā ityevācakṣate prāṇo hye vaitāni sarvāṇi bhavati. (15)
In the body of a living being neither the power to speak, nor the power to see, nor the power to hear, nor the power to think is the prime factor; it is life which is the center of all activities.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
ईशानः प्राणदः प्राणो ज्येष्ठश्श्रेष्ठः प्रजापतिः ।हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ॥ ८ ॥
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్శ్రేష్ఠః ప్రజాపతిః ।హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ ౮ ॥
Īśānaḥ prāṇadaḥ prāṇo jyeṣṭhaśśreṣṭhaḥ prajāpatiḥ ।Hiraṇyagarbho bhūgarbho mādhavo madhusūdanaḥ ॥ 8 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom
చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group
https://t.me/ChaitanyaVijnanam
23 Oct 2020
No comments:
Post a Comment